ప్రపంచానికి చాటి చెప్పేలా హాఫ్ మారథాన్ ఈవెంట్

ప్రపంచానికి చాటి చెప్పేలా హాఫ్ మారథాన్ ఈవెంట్

సిద్దిపేట పోలీసు కమిషనర్ ఎన్.శ్వేత 
ప్రపంచానికి చాటి చెప్పేలా హాఫ్ మారథాన్ ఈవెంట్ సిద్దిపేటలో నిర్వహిస్తామని సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎన్ శ్వేత చెప్పారు.ఆరోగ్య సిద్దిపేటలో భాగంగా  ఆగస్టు 6 నాడు సిద్దిపేట పట్టణంలో హాఫ్ మారథాన్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.ఆదివారం నాడు సిద్దిపేట కోమటి చెరువు రూబీ నెక్లెస్  వద్ద సిద్దిపేట రన్నర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆగస్టు 6 సన్నాహక రన్ ను సిపి శ్వేత ప్రారంభించారు. ఈ సందర్భంగా 5కే, 10కే,,21కే, రన్ లో పట్టణ ప్రముఖులు యువకులు,సిద్దిపేట రన్నర్స్ మొత్తం 300 మంది ఉత్సవంగా పాల్గొన్నారు. పోలీస్ కమిషనర్ శ్వేత మాట్లాడుతూ మంత్రి తన్నీరు హరీష్ రావు చొరవతో ఆగస్టు 6న నిర్వహించే ఈవెంట్స్ లో  సిద్దిపేటతో పాటు వివిధ జిల్లాల  యువతి యువకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు.సిద్దిపేట అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధి చెందిందని సిద్దిపేట పట్టణం నలుమూలల ప్రజల ఆరోగ్య పరిరక్షణ గురించి మంత్రి ఓపెన్ జిమ్ములు  ఏర్పాటు చేయించారని తెలిపారు.

ఆరోగ్య పరిరక్షణ గురించి సిద్దిపేట పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలు పాటుపడాలని సూచించారు.ఎవరి ఆరోగ్యం వారి చేతుల్లో ఉంటుందని తెలిపారు. హాఫ్ మారథాన్  పాల్గొనేవారు 5కె, 10కె, 21కె రన్ లో పాల్గొని పూర్తి చేయాలని సూచించారు  పాల్గొనడం ముఖ్యమనిఎంత సమయంలో పూర్తి చేశామన్నది ముఖ్యం కాదని అందరూ టార్గెట్ రీచ్ కావడం ముఖ్యమని తెలిపారు. ప్రతిరోజు యోగా, వాకింగ్, రన్నింగ్,  స్విమ్మింగ్, జిమ్,ఏదో ఒక ఎక్సర్సైజు చేస్తూ ఉండాలని సూచించారు.ఆఫ్ మారథాన్ ఆగస్టు 6న ఉన్నందున ఇప్పటినుండే ప్రాక్టీస్ చేయాలని ప్రతి రోజూ ప్రాక్టీస్ చేస్తే ఆరోజు ఆఫ్ మారధాన్ పూర్తి చేయడం చాలా సులువుగా ఉంటుందని తెలిపారు.సిద్దిపేట పట్టణ అభివృద్ధి అందాల గురించి తెలంగాణ రాష్ట్రానికి, ప్రపంచానికి చాటి చెప్పేలా హాఫ్ మారథాన్ ఈవెంట్ అద్భుతంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 

మార్చ్ 5న వాల్ పోస్టర్,ఆన్లైన్ లింక్  మంత్రి తన్నీరు హరీష్ రావు ఆవిష్కరించడం జరిగిందన్నారు. రన్ లో పాల్గొనే  ఉత్సవవంతులైన యువతి యువకులు తేదీ: 06- ఆగస్టు -2023 నాడు సిద్దిపేట జిల్లా రంగనాయక సాగర్ ప్రాజెక్టు, సిద్దిపేట పట్టణం డిగ్రీ కళాశాల గ్రౌండ్ నుండి 5కె,10కె, 21కె (ఆఫ్ మారథాన్) పోటీలు నిర్వహించడం జరుగుతుందనితెలిపారు. రన్నింగ్ పోటీలకు సంబంధించిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లింక్ https://shm23.iq301.com  ఈ లింక్ ఓపెన్ చేసి వారి యొక్క వివరాలు నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని హాఫ్ మారథాన్  పాల్గొనవచ్చని పేర్కొన్నారు.లింక్  ఈరోజు నుండి  ఈ నెల 20-07-2023 సాయంత్రం 6:00 గంటల వరకు ఓపెన్ ఉంటుంది.ఆసక్తి గల యువతీయువకులు హాఫ్ మారథాన్ పోటీలో పాల్గొని విజయవంతం చేయగలరని సూచించారు. ఆన్లైన్ లింకులో పేరు నమోదు చేసుకోవాలని ఈవెంట్ లో పాల్గొన్న  వారందరికీ టీషర్ట్, మెడల్స్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.

రిజిస్ట్రేషన్ చార్జీలు
5km ₹ 200 రూపాయలు
10km ₹ 300 రూపాయలు
21km ₹ 500 రూపాయలు గూగుల్ పే, ఫోన్ పే, యూపీఐకోడ్, ద్వారా చెల్లించి పేరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.
 ఆగస్టు 6 నాడు ఉదయం 5:30 గంటలకు 10కె, 21కె సిద్దిపేట పట్టణం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం నుండి రంగనాయక సాగర్ ప్రాజెక్టు వరకు రన్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
ఆగస్టు 6 న ఉదయం 5:30 గంటలకు 5కె రన్  రంగనాయక సాగర్ ప్రాజెక్టుపై నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

21 కె రన్ పురుషుల విభాగంలో 
ప్రధమ-50,000,
ద్వితీయ-25,000,
తృతీయ-10,000,
విజేతలకు నగదు పురస్కారం అందజేయడం జరుగుతుందనితెలిపారు.
21 కె రన్ మహిళల విభాగంలో 
ప్రధమ-50,000,
ద్వితీయ-25,000,
తృతీయ-10,000,
విజేతలకు నగదు పురస్కారం అందజేయడం జరుగుతుందని
తెలిపారు.
10 కె రన్ పురుషుల విభాగంలో  
ప్రధమ-25,000,
ద్వితీయ-15,000,
తృతీయ-10,000,
విజేతలకు నగదు పురస్కారం అందజేయడం జరుగుతుందని
తెలిపారు.
10 కె రన్ మహిళల విభాగంలో  
ప్రధమ-25,000,
ద్వితీయ-15,000,
తృతీయ-10,000,
విజేతలకు నగదు పురస్కారం అందజేయడం జరుగుతుందని
తెలిపారు.
5 కె రన్ పురుషుల విభాగంలో 
ప్రధమ-15,000,
ద్వితీయ-10,000,
తృతీయ-5,000,
విజేతలకు నగదు పురస్కారం అందజేయడం జరుగుతుందని తెలిపారు.
5 కె రన్ పాల్గొన్న మహిళల ఈ విభాగంలో
ప్రధమ-15,000,
ద్వితీయ-10,000,
తృతీయ-5,000,
విజేతలకు నగదు పురస్కారం అందజేయడం జరుగుతుందని తెలిపారు. హాఫ్ మారథాన్ పోటీల విషయంలో ఉత్సవ వంతులైన యువతీ,యువకులకు పాల్గొనే వారికి ఏమైనా సందేహాలు ఉంటే సిద్దిపేట రన్నింగ్ అసోసియేషన్ అధ్యక్షులు కత్తుల బాపురెడ్డి  9440494455, పరంధాములు 9010901511, రఘుపతి రెడ్డి  9966935333 నెంబర్లకు ఫోన్ చేసి సందేహాలు నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఈ రన్ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ ఎస్. మహేందర్,మున్సిపల్ వైస్ చైర్మన్ జంగిటి కనకరాజు,కౌన్సిలర్  గోపాలపురం దీప్తి నాగరాజు, ట్రాఫిక్ ఏసిపి ఫణిందర్,ఎస్బి ఇన్స్పెక్టర్ రఘుపతి రెడ్డి, త్రీటౌన్ సీఐ భాను ప్రకాష్, ట్రాఫిక్ సిఐ రామకృష్ణ,సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కత్తుల బాపురెడ్డి, అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకట స్వామి, మెంబర్లు,వాకర్స్ అసోసియేషన్ మెంబర్లు,యువతి యువకులు,ఉద్యోగ, ఉపాధ్యాయులు,  పోలీస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.