కోమటి చెరువు చెంత  మరో కొత్త వేదిక

కోమటి చెరువు చెంత  మరో కొత్త వేదిక
  •  రూ. 25 కోట్లతో సిద్దిపేటలో శిల్పారామం ఏర్పాటు 
  • 22న శంకుస్థాపన చేయనున్న మంత్రి హరీష్ రావు

సిద్దిపేట  : ముద్ర ప్రతినిధి: సిద్దిపేట ఎన్నో కళలు, సంస్కృతులు, సంప్రదాయాలకు, అభివృద్ధి కార్యక్రమాలకు వేదిక గా మారింది. మంత్రి హరీష్ రావు కృషితో రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా విరాజిల్లుతున్నది. ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందిన కోమటి చెరువు మరో కొత్త కళను సంతరించుకోనుంది..  నగరాలకే పరిమితమైన శిల్పారామం సిద్దిపేటలో ఏర్పాటు కానుంది. మంత్రి హరీష్ రావు కృషితో 25 కోట్లతో కోమటి చెరువు నెక్లస్ రింగ్ రోడ్డులో( బైపాస్ రోడ్డు) శిల్పారామం మంజూరు చేయించారు. శనివారం సాయంత్రం శిల్పారామం పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సంస్కృతి ,సాంప్రదాయం ఉట్టిపడేలా వృత్తి నైపుణ్య జీవన విధానాలను తెలిసేలా అద్భుతమైన శిల్పారామం మన సిద్దిపేటలో నిర్మాణం చేసుకోనుంది.

శిల్పారామంతో పాటు ఏర్పాటు చేయనున్న వసతులు
పర్యాటకులను ఆకట్టుకునే ఆటలు. 21 రకాల సౌకర్యాలు. పర్యాటక శోభ, సంస్కృతి సంప్రదాయంతో పాటు ఆకట్టుకునే ఆటలు వచ్చే ప్రజలకు పర్యాటకులకు ఎంతో ఆకర్షించనున్నాయ్. ఇందులో వాటర్ ఫౌంటెన్,ఫుడ్ కోర్ట్, బజార్ స్టాల్స్,రాక్ గార్డెన్,బంకెట్ హల్,గో కార్టింగ్, చిల్డర్స్ ప్లే ఏరియా, స్కూల్పటర్స్ ,గజేబో , కిడ్స్ పుల్ ఏరియా, కాటేజస్,డెక్, స్విమ్మింగ్ ఫుల్, బంపర్ కార్స్, జోరబింగ్ ,ఫిష్ ప, గోల్ఫ్ కోర్ట్, బ్యాడ్మింటన్ కోర్ట్, వాలిబాల్ కోర్ట్,కబడ్డీ కోర్ట్, ఆర్టిఫిషయల్ బీచ్ ఇలా 21 సౌకర్యాలు, పెద్దలు, పిల్లల ఆటలు అడుకొనే గొప్ప వేదికగా సిద్దిపేట ప్రజల ముందుకు రానుంది.

మినీ బీచ్ గా కోమటి చెరువు

కోమటి చెరువు బైపాస్ రోడ్డులో మినీ బీచ్ ఏర్పాటు కానుంది. సిద్దిపేట కోమటి చెరువు చుట్టూ మణిహారంగా నెక్లస్ రోడ్డు పూర్తి స్థాయిలో నిర్మిస్తున్నారు.
ఈ నేపథ్యంలో బైపాస్ రోడ్డులో ఆర్టీ ఫిషయల్ బీచ్ ను మినీ బీచ్ కోమటి చెరువు వద్ద ఏర్పాటు కానుంది.ఇక సిద్దిపేట ప్రజలు వైజాగ్ లాంటి ప్రాంతల వద్ద ఉండే బీచ్ ల వద్దకు కాకుండా సిద్దిపేట లోనే వెళ్లే విధంగా మంత్రి హరీష్ రావు గారు ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నారు.