కోమటి చెరువు కట్టపై మరో రెండు వినోద కేంద్రాల ఏర్పాటు

కోమటి చెరువు కట్టపై మరో రెండు వినోద కేంద్రాల ఏర్పాటు
  • డైనో సార్ పార్కు
  • వాటర్ గేమింగ్ పాయింట్ 
  • త్వరలో ప్రారంభించ నున్న మంత్రి

ముద్ర ప్రతినిధి, సిద్ధిపేట: సిద్దిపేట కోమటి చెరువువద్ద మరో వినోదం ప్రజలకు త్వరలో అందుబాటులోకి రానుంది. డైనో సార్ పార్కు, వాటర్ గేమింగ్ పాయింట్ కట్ట వద్ద ఏర్పాటు చేయడంతో పిల్లలకు పంచడానికి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే రాక్ గార్డెన్, గ్లో గార్డెన్,అడ్వెంచర్స్ పార్కులు ఉన్నాయి. చెరువులో బోటింగ్ రన్నింగ్ ట్రాక్ వాకింగ్ ట్రాక్ ఉండడంతో పిల్లలు పెద్దలు కట్టను సందర్శించి వినూత్నమైన రీతిలో అనుభూతి చెందుతున్న విషయం తెలిసిందే, రాష్ట్రం తోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన టూరిస్టులకు కూడా కోమటి చెరువు కట్టను సందర్శించి ఆహ్లాదాన్ని పొందుతున్నారు.

వారికి మరింత అనుభూతి కలిగించేలా డైనో సార్ పార్కు, వాటర్ గేమింగ్ పాయింట్ ను ఏర్పాటు చేస్తుండడంతో కుటుంబం, స్నేహితులతో కలిసి వచ్చేవారికి ఇది మరింత ఆహ్లాదాన్ని కలిగించనుంది. ఉద్యాన వనానికి, పిక్నిక్, వీకెండ్ కు జిల్లా వాసులే కాకుండా టూరిస్టులు కూడా కోమటి చెరువుకు వస్తున్నారు.చెరువు అందాలను, ఆస్వాదిస్తూ ఇక్కడున్న క్రీడల్లో పాల్గొంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక మంత్రి హరీష్ రావు ప్రత్యేక శ్రద్ధతో కోమటి చెరువును సుందరీకరించి,పలు వినోద కార్యక్రమాలను ఇక్కడ ఏర్పాటు చేయించారు.అన్ని వసతులు కల్పించారు. కోట్లాది రూపాయల వ్యయం చేస్తూ ఈ కార్యక్రమాలను మంత్రి హరీష్ రావు చేపడుతున్నారు.

డైనోసార్ పార్కు విశేషాలు
మీరు డైనోసార్ల యుగంలో వెళ్లాలని అనుకుంటే మీరు తప్పనిసరిగా సిద్ధిపేట మినీ ట్యాంక్ బండ్ రావాల్సిందే.డైనోసార్ పార్కును సందర్శించాల్సిందే.అన్నట్లుగా ఈ డైనోసార్ థీమ్ పార్క్, మ్యూజియం కలయికగా ఉండనున్నది. ఈ పార్కులో పెద్దలు, పిల్లలు ఇద్దరికీ మంచి ఆరోగ్యకరమైన వినోదాన్ని అందిస్తుంది.4D సినిమా తరహాలోనే ప్రత్యక్షంగా చూడటమే డైనోసార్ ప్రత్యేక పార్కు సందర్శన వినోదాత్మకంగా ఓ వినూత్న అనుభూతి, అనుభవం కలుగుతుంది. ఈ పార్క్‌లో పలు రకాలైన యానిమేట్రానిక్స్ డైనోసార్‌లు, అతిపెద్ద 4D సిమ్యులేటర్ ఉండనున్నాయి. తవ్విన గుహలో అంతరించిపోయిన మాంసాహార డైనోసార్లతో ముఖాముఖిగా మిమ్మల్ని పలకరింపులోకి తీసుకుని రానున్నది.

వాటర్ గేమింగ్ పాయింట్
కోమటి చెరువు రూబీ నెక్లెస్ రోడ్ మొత్తం 3.3 కిలోమీటర్ల మేర ఉంటుంది. దీంట్లో భాగంగా మూడవ డెక్ లో చిన్నా,పెద్దలు థ్రిల్లింగ్ పొందేలా వాటర్ గేమింగ్ జోన్ పాయింట్ ఆగస్టు నెలాఖరుకు త్వరలోనే అందుబాటులో రానున్నది.దాన్ని అధికారులు, కాంట్రాక్టరు యుద్ద ప్రతి పూర్తి చేయడానికి అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.వాటర్ గేమింగ్ పాయింట్ లో వాటర్ స్లైడ్లు కిందకు జారడం చూపరులను ఆకర్షించి థ్రిల్లింగ్ కలిగించడం, ఈ వాటర్ గేమింగ్ పాయింట్ లో వాటర్ స్లయిడ్‌లు చిన్నవిగా ఉంటాయి. కానీ సమానంగా సరదాగా ఉంటాయి.పెద్దలు, అలాగే పిల్లలు కూడా ఈ వాటర్ పార్కులో థ్రిల్ అవుతూ జారుతున్నట్లు ఉన్న వాటర్ చూస్తూ ఎంతో అనుభూతి పొందేల ఏర్పాటు చేస్తున్నారు. 

కోమటి చెరువు కట్టపై మంత్రి హరీష్ రావు పర్యటన
ఆదివారం రాత్రి రాష్ట్ర ఆర్థిక,వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు కోమటి చెరువు కట్టపై పర్యటించారు.  ట్యాంక్ బండ్ పై కలియ తిరుగుతూ అక్కడికి సందర్శనకు వచ్చిన వారితో మాటామంతి కలిపారు. కుటుంబీకులతో కాలక్షేపానికి వచ్చిన టూరిస్టులు, యువత మంత్రితో సెల్ఫీ దిగేందుకు పోటీపడ్డారు. ఇదే క్రమంలో నెక్లెస్ రోడ్ ఫేజ్ వారీగా ఉన్న నిర్మాణ పనులు పరిశీలిస్తూ పనులు ముమ్మరం చేయాలని అధికార వర్గాలు, కాంట్రాక్టరును మంత్రి ఆదేశించారు. అనంతరం వాటర్ గేమింగ్ ఫాల్ను డైనోసార్ పార్క్ ను సందర్శించి పనులు వేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను, కాంట్రాక్టర్ను ఆదేశించారు.