సోషల్ మీడియా నేడు అతిపెద్ద ప్లాట్ ఫామ్

సోషల్ మీడియా నేడు అతిపెద్ద ప్లాట్ ఫామ్
  • ఫేస్ బుక్,ట్విట్టర్ పై టెక్ టీమ్ సిబ్బందికి ఒకరోజు వర్క్ షాప్
  • సిద్దిపేట అడిషనల్ డిసిపి మహేందర్

ముద్ర ప్రతినిధి :సిద్దిపేట:-సోషల్ మీడియా ఫేస్ బుక్,ట్విట్టర్ పై పోలీసు టెక్ టీమ్ సిబ్బందికి పోలీస్ అధికారులు ఒకరోజు వర్క్ షాప్ నిర్వహించారు.బుధవారం నాడు సిద్దిపేట పోలీసు కమిషనరేట్లో జరిగిన ఈకార్యక్రమంలో జిల్లాలో ని పోలీసు విభాగంలో టేక్ టీమ్ స్టాప్ పాల్గొన్నారు.అడిషనల్ డీసీపీ (అడ్మిన్) ఎస్. మహేందర్ ఆధ్వర్యంలో ఈ శిక్షణ శిబిరం జరిగింది ఈ సందర్భంగా డిసిపి మాట్లాడుతూ  నేటి ప్రపంచంలో సోషల్ మీడియా ఒక ముఖ్యమైన భాగం అయ్యిందని చెప్పారు. వ్యక్తులు కనెక్ట్ అయి ఉండడానికి, ఆలోచనలు,ఆలోచన విధానాన్ని అభిప్రాయాలను ఇతరులతో పంచుకోవడానికి సోషల్ మీడియా, ఫేస్బుక్, ట్విట్టర్ చాలా పెద్ద ఫ్లాట్ ఫామ్ అయ్యాయని అడిషనల్ డీసీపీ మహేందర్ తెలిపారు.

ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతిరోజు ప్రజలకు ఉపయోగపడే విధంగా చేసే పనిని ఫేస్బుక్, ట్విట్టర్ లో పోస్ట్ చేయాలని, సంబంధిత గ్రామాల యువకులను అందులో ట్యాగ్ చేయాలని సూచించారు.సోషల్ మీడియాలో ఐదు రకాల పోస్టులు చేయవచ్చని తెలిపారు.సోషల్ నెట్వర్కింగ్,ఫోటో షేరింగ్, వీడియో షేరింగ్, ఇంట్రాక్టివ్ మీడియా,కమ్యూనిటీ  బిల్డింగ్, సోషల్ మీడియాను బాగా ఉపయోగించాలని తెలిపారు.ప్రస్తుతం పోలీస్ శాఖతో పాటు అన్ని వర్గాలు టెక్నాలజీతో ముందుకు వెళ్తున్నాయని తెలిపారు. బ్లూకాల్ట్స్,పెట్రో కార్ సిబ్బంది ప్రతిరోజూ గ్రామాలలో, పట్టణాలలో సందర్శించినప్పుడు ప్రజలకు,యువకులకు ఫేస్బుక్, ట్విట్టర్ ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో హ్యాండిల్ చేయడం జరుగుతుందని, అందువల్ల దానిపై వారికి అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజలకు ఉపయోగపడే మానవత్వాన్ని చాటే ఎన్నో పనులు చేస్తూ ఉంటారు వాటన్నిటినీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని సూచించారు. సోషల్ మీడియా సామాజిక మధ్యమాలలో ఏదైనా పోస్ట్ చేసేటప్పుడు  బాగా విశ్లేషించి పోస్ట్ చేయాలని సూచించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో సోషల్ మీడియా ఫాలోవర్స్ ను పెంచుకోవాలని తెలిపారు.నూతన టెక్నాలజీని అందుపుచ్చుకొని విధి నిర్వహణలో ముందుకు వెళ్లాలని సామాజిక మాధ్యమాల ద్వారా మనం చేసే పనిని  ప్రజలకు షేర్ చేయడం ద్వారా  పోలీస్ వ్యవస్థ యొక్క ఇమేజ్ పెరుగుతుందని సూచించారు.సోషల్ మీడియా ఎక్కువ ఉపయోగించడం వల్ల కమ్యూనికేషన్ సహకారం, అభిప్రాయాలు, సమీక్షలు, మానిటరింగ్,  మీడియా భాగస్వామ్యం మరింత పెంపొందించుకోవచ్చని డిసిపి మహేందర్ సూచించారు.

సామాజిక మధ్యమాల ద్వారా కమ్యూనిటీ పెంచుకోవచ్చని, వ్యక్తులతో పరస్పర పరిచయాలు పెంచుకోవచ్చని ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా ప్రజలకు మరింత దగ్గర అయ్యే అవకాశం ఉన్నందున సోషల్ మీడియాను బాగా ఉపయోగించుకోవాలని సూచించారు. సామాజిక మాధ్యమాల ద్వారా పోలీసులు ప్రజల గురించి చేసే ప్రతి పనిని నేరుగా ప్రజలకు తెలపడం సాధ్యం కానందున సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు తెలియపరచడం చాలా ముఖ్యమని తెలిపారు. ఫేస్బుక్, ట్విట్టర్ ఉపయోగించి ప్రజలకు తెలియపరచడం చాలా ముఖ్యమని సులభమని తెలిపారు. ఎక్కువ ఫాలోవర్స్ ఉండేటట్లు ప్రజలను యువకులను మోటివేట్ చేయాలని తెలిపారు.సోషల్ మీడియా ప్రాముఖ్యత, ఉపయోగించే విధానం గురించి ఎస్బి ఇన్స్పెక్టర్ రఘుపతి రెడ్డి, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సిబ్బందికి అవగాహన కల్పించారు.ఈ వర్క్ షాప్ లో సిద్దిపేట ఏసిపి దేవారెడ్డి,గజ్వేల్ ట్రాఫిక్ సిఐ తిరుపతి,టెక్ టీమ్ సిబ్బంది, జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్లు అశోక్, వేణు తదితరులు పాల్గొన్నారు