కేంద్ర మంత్రులను కలిసిన దుబ్బాక ఎమ్మెల్యే

కేంద్ర మంత్రులను కలిసిన దుబ్బాక ఎమ్మెల్యే

సిద్దిపేట: ముద్ర ప్రతినిధి: కేంద్ర మంత్రులు నితిన్ గడ్కారీ,కిషన్ రెడ్డి లను దుబ్బాక శాసనసభ్యులు ఎం రఘునందన్ రావు కలిసి వినతి పత్రాలు అందజేశారు. మెదక్-సిద్దిపేట-ఎల్కతుర్తి జాతీయ రహదారి 765 డీజీకి విస్తరణ నిర్మాణానికి సంబంధించి అధికారులు చేసిన నూతన సవరణల వలన భూములు కోల్పోతున్న దుబ్బాక నియోజకవర్గం లోని అక్బర్ పేట-భూంపల్లి మండల రైతులతో  ఢిల్లీ వెళ్లిన  రఘునందన్ రావు ఇద్దరు మంత్రులను కలిశారు.పాత సవరణల ప్రకారమే రహదారి నిర్మాణం  చేపట్టాలని కేంద్ర రహదారుల శాఖ మంత్రివర్యులు నితిన్ గడ్కారీ నీ ఢిల్లీలోని వారి కార్యాలయంలో కోరారు .అనంతరం హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని కూడా కలిసి ఇదే విషయమై వినతి పత్రం అందజేశారు.