సుడా లేఅవుట్ పరిశీలించిన కలెక్టర్

సుడా లేఅవుట్ పరిశీలించిన కలెక్టర్
  • 20న విపంచిలో అవగాహన సదస్సు
  • ప్లాట్ల విక్రయానికి సర్కారు ఏర్పాట్లు

సిద్దిపేట: ముద్ర, ప్రతి నిధి: ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రోత్సహించేందుకు సిద్దిపేట జిల్లాలో ప్రయోగాత్మకంగా మాడల్ లేఅవుట్ ను ఏర్పాటు చేసింది. దీని ద్వారా ప్లాట్లను విక్రయించి ఆదాయాన్ని అర్ధించుకోవడానికి కస రత్తు ప్రారంభించింది. సిద్దిపేట అర్బన్ మండలంలోని మిట్టపల్లి గ్రామంలో సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ  (సుడా) ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సుడా-మిట్టపల్లి మోడల్ లేఅవుట్ ను శుక్రవారం నాడు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ పరిశీలించారు. ఈ సందర్భంగా లేఅవుట్లో కల్పిస్తున్న మౌలిక వసతులైన విద్యుత్తు, రహదారి, త్రాగునీరు ఓపెన్ స్పేస్ తదితర వసతులను పరిశీలించారు.

 ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏలాంటి సమస్యలు లేని,అన్ని రకాలుగా ప్రభుత్వ అనుమతులతో   సిద్దిపేట నుండి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో  సుడా ఆధ్వర్యంలో సుడా- మిట్టపల్లి మోడల్ లే అవుట్ ను రూపొందించడం జరిగిందని అన్నారు. సుడా ఆధ్వర్యంలో అన్ని మౌలిక వసతులతో అభివృద్ధి చేసిన లేఅవుట్ వేలం పాటకు  సంబంధించి ఈ నెల 20న శనివారం ఉదయం11గంటలకు విపంచి భవనములో జరిగే అవగాహన సదస్సుకు హాజరై ప్లాట్ల కొనుగోలు పై తమకు గల సందేహాలను నివృత్తి చేసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా ప్రజలకు సూచించారు.