కాచాపూర్ గ్రామాన్ని సందర్శించిన సీఆర్డీ

కాచాపూర్ గ్రామాన్ని సందర్శించిన సీఆర్డీ

 శంకరపట్నం ముద్ర మే 19 : శంకరపల్లి మండల పరిధిలోని కాచాపూర్ గ్రామంలో శుక్రవారం  అసిస్టెంట్ డైరెక్టర్ సి ఆర్ డి ఎస్ ఎన్ విజయ రావు సందర్శించారు.గ్రామంలోని సెగ్రిగేషన్ షెడ్,వైకుంఠధామం,నర్సరీ లని సందర్శించి వారి పనితీరుని ప్రత్యక్షంగా ఆరా తీశారు. అనంతరం గ్రామపంచాయతీలో సమావేశం ఏర్పాటు చేసి సానిటేషన్, స్వచ్ఛసర్వేక్షన్ గ్రామీణ్ 2023 పై సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిపిఓ వీర బుచ్చయ్య ఎస్ బి ఎం,జిల్లా కో ఆర్డినేటర్ రమేష్, గ్రామ  సర్పంచ్ కొండ్ర రాజయ్య ఎంపీడీవో ఖాజా బషీరుద్దీన్ పంచాయతీ కార్యదర్శి ఎం గంగజమున ఉపసర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.