మెడికల్ కళాశాల పనులు గడువులోగా పూర్తి చేయాలి...

మెడికల్ కళాశాల పనులు గడువులోగా పూర్తి చేయాలి...

 మహబూబాబాద్ జిల్లాకలెక్టర్ శశాంక 

ముద్రప్రతినిధి, మహబూబాబాద్: మెడికల్ కళాశాల పనులు నిర్దేశించిన సమయంలో గా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు. మహబూబాబాద్ లో శుక్రవారం  తొర్రూరు రోడ్డులో నిర్మిస్తున్న మెడికల్ కళాశాల పనులను కలెక్టర్ శశాంక సంబంధిత అధికారులతో సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శశాంక మాట్లాడుతూ.. మెడికల్ కళాశాల పనులను జూలై మాసాంతానికి అందజేయాలని అధికారులను ఆదేశించారు. సుమారు 700 పడకలకు పైగా 30 ఎకరాలలో చేపట్టిన మెడికల్ కళాశాల నిరుపేదలకు అందుబాటులోకి రానున్నదని వైద్య సౌకర్యాలు త్వరితగతిన అందించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. అదేవిధంగా వైద్య విద్యార్థులకు సౌకర్యాలు కూడా సమకూర్చాల్సి ఉన్నందున పనులు నాణ్యతతో వేగవంతంగా చేపట్టాలన్నారు.

మహబూబాబాద్ జిల్లాగా ఆవిర్భవించడం వైద్య సౌకర్యాలు మరింతగా మెరుగుపడ్డాయన్నారు మెడికల్ కళాశాల ఈ ప్రాంతంకు వరంగా నిలిచిందన్నారు. పూర్తి ఏజెన్సీ ప్రాంతంగా నిరుపేదలు ఎక్కువగా ఉండే మహబూబాబాద్ వైద్య సౌకర్యాలతో త్వరలో మెడికల్ కళాశాల అందుబాటులోకి రానున్నందున అభివృద్ధి వేగవంతంగా ఉండనున్నదన్నారు. కలెక్టర్ శశాంక వెంట కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు, జిల్లాఆసుపత్రుల సమన్వయ అధికారి శ్రీనివాస్, రోడ్లు భవనాల శాఖ అధికారి తానేశ్వర్, టిఎస్ఎంఐడిసి అధికారి ఉమామహేష్, తహసిల్దార్ ఇమ్మానుయేల్ తదితరులు పాల్గొన్నారు.