జిల్లా పోలీస్ కార్యాలయంలో దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు

జిల్లా పోలీస్ కార్యాలయంలో దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు

ముద్ర ప్రతినిధి మహబూబాబాద్:  తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య జయంతి వేడుక‌ల‌ను మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్  దొడ్డి కొమురయ్య  చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ జోగుల చెన్నయ్య,అర్ఐ లు సురేష్, లాల్ బాబు, పూర్ణ చందర్, ఎస్ బి ఇన్ స్పెక్టర్ ఫణిధర్, డీసిఆర్ బి ఇన్ స్పెక్టర్ బాలాజీ వరప్రసాద్, సైబర్ సెల్ ఇన్ స్పెక్టర్ రవి కుమార్, టాస్క్ ఫోర్స్ ఇన్ స్పెక్టర్ శ్రీనివాస్,రూరల్ సీఐ రమేష్, డీపీఓ సిబ్బంది ,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.