ఆ ‘పూర్వ' విద్యార్థుల సమ్మేళనం..!

ఆ ‘పూర్వ' విద్యార్థుల సమ్మేళనం..!

37 ఏళ్ల తర్వాత ఒక్కచోట చేరిన క్లాస్మేట్స్

కేసముద్రం, ముద్ర: మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో 1985-86 ఎస్ఎస్సి బ్యాచ్ ఆ పూర్వ విద్యార్థులు 37 ఏళ్ల తర్వాత ఒక్కచోట చేరిన అపూర్వ ఘటన చోటుచేసుకుంది. శనివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. ఉదయం నుండి రాత్రి వరకు ఆనాటి ఆ పాత మిత్రులందరికీ తమ చిన్ననాటి జ్ఞాపకాల నుంచి ప్రస్తుతం తాము చేస్తున్న వృత్తి, వ్యాపార, ఉద్యోగ, ఉపాధి, కుటుంబ యోగక్షేమాలను పరస్పరం పంచుకున్నారు. 37 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఒక చోట చేరడం అనిర్వచనియమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఆనాటి ఆపాతమిత్రులు
వద్దిరాజు దేవేందర్, వద్దిరాజు లక్ష్మి, వద్దిరాజు పెద్ద వెంకన్న, చిన్న వెంకన్న, సర్పంచ్ రామ్మూర్తి, ఎస్సై కుమారస్వామి, ఏఎస్ఐ వెంకటేశ్వర్లు (నెల్లికుదురు), డిఈ సుధా కిరణ్, ఆనాటి విద్య నేర్పిన గురువులు సత్తయ్య, ఉపేందర్, రాంచంద్రారెడ్డి, మల్లయ్య, హేమలత, విజయ, సునీత, బాల్య మిత్రులు సుమారు 52 మంది పాల్గొన్నారు. త్వరలో పదవ సమావేశం నిర్వహించుకొని తమకు అక్షర జ్ఞానం ప్రసాదించిన పాఠశాల, జన్మించిన గ్రామానికి ఉపయోగపడే విదంగా కార్యక్రమాలను చేపట్టాలని తీర్మానించారు.