వేసవిలో త్రాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోవాలి...-మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంక

వేసవిలో త్రాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోవాలి...-మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంక

ముద్రప్రతినిధి‌,మహబూబాబాద్:

త్రాగు నీటి ఎద్దడి రానీయకుండా అధికారులు ప్రణాళిక బద్ధంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.

మహబూబాబాద్ లో బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో త్రాగునీటి సరఫరా పై మహబూబాబాద్ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రాంమ్మోహన్ రెడ్డి, అదరపు కలెక్టర్ అభిలాషఅభినవ్, మున్సిపల్, విద్యుత్తు, మిషన్ భగీరథ అధికారులతో సమ్మర్ యాక్షన్ ప్లాన్ పై సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ శశాంక మాట్లాడుతూ...

వేసవిలో త్రాగునీటి కొరత రాకుండా అధికారులు ప్రణాళిక బద్ధంగా కృషి చేయాలని ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా త్రాగునీరు అందించేందుకు ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. మున్సిపాలిటీలో పెరిగిన మంచినీటి కనెక్షన్లు, వేసవి ఉష్ణోగ్రత వంటివి దృష్టిలో పెట్టుకొని త్రాగునీరు వృధా కాకుండా పర్యవేక్షించాలని అదేవిధంగా చౌర్యం కాకుండా ఎన్ఫోర్స్మెంట్ చేపట్టాలన్నారు.

ప్రతి 15 రోజులకు ఒకసారి బావులు, బోర్లు నుండి సరఫరా చేసే నీటిని పరీక్షించాలన్నారు.

మున్సిపల్ అధికారులు వార్డులు వారీగా పర్యటించి సమస్యలు ఇబ్బందులు గుర్తించాలని,వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు.

ఈ సమీక్ష సమావేశంలో మిషన్ భగీరథ గ్రీడ్ ఇంజనీర్ సురేందర్, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ అధికారి రంజిత్ కుమార్, మున్సిపల్ కమిషనర్ ప్రసన్నరాణి, విద్యుత్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.