కొనుగోలు చేసిన ధాన్యాన్ని తక్షణమే తరలించాలి...

కొనుగోలు చేసిన ధాన్యాన్ని తక్షణమే తరలించాలి...
  •  మహబూబాబాద్ జిల్లాకలెక్టర్ శశాంక

ముద్రప్రతినిధి,మహబూబాబాద్: కొనుగోలు కేంద్రాలలో ధాన్యం మొక్కజొన్న పంటలను కొనుగోలు చేసిన తక్షణమే రవాణా చేపట్టి తరలించాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు. మహబూబాబాద్ లో సోమవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ధాన్యం,మొక్కజొన్న కొనుగోళ్లుపై సంబంధిత అధికారులతో కలెక్టర్ శశాంక సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శశాంక మాట్లాడుతూ.. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నా లేకపోయినా కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిలువ ఉంచరాదని రవాణా చేపట్టి తరలించాలన్నారు. టార్పాలిన్స్ ఉన్న తాత్కాలికంగా ధాన్యం తడవకుండా వినియోగించడానికి మాత్రమేనని ప్రతిరోజు కనీసం 3 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం తరలించేందుకు ఏర్పాట్లు చేపట్టాలన్నారు.

కొనుగోలు కేంద్రాల నిర్వహకులు వాహనాలను ధాన్యం రవాణాకు సిద్ధంగా ఉంచుకోవాలని మధ్యాహ్నం 12 గంటల వరకు ధాన్యాన్ని పరిశీలించి మాయిచ్చర్ వచ్చిన ధాన్యాన్ని ముందుగా కొనుగోలు చేపట్టాలని రెవెన్యూ అధికారులు ఆన్లైన్ ఎంట్రీ త్వరగా చేయించి సాయంత్రం నాలుగు గంటల లోపు కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్స్ కు తరలించి ట్రక్ షీట్ కట్ చేసే వరకు పర్యవేక్షించాలన్నారు. హమాలీల కొరత రాకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలన్నారు. కొనుగోలు కేంద్రాలలో రైతులు ధాన్యాన్ని కుప్పలుగా ఉంచరాదని ఆరబెట్టుకోవాలని సూచించారు.

సూర్యాపేట, నల్గొండలలో మిల్లర్స్ తో మాట్లాడి 20 మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం దింపుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యం కొనుగోలులో అశ్రద్ధ చేయరాదని అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సిబ్బందిని అప్రమత్తం చేయాలన్నారు. ఈ..సమీక్ష సమావేశంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ సన్యాసయ్య, జిల్లావ్యవసాయశాఖ అధికారి చత్రునాయక్, పౌరసరఫరాల అధికారి నర్సింగ్ రావు, సివిల్ సప్లై జిల్లా మేనేజర్ కృష్ణవేణి, ఆర్టీవో రమేష్ రాథోడ్, గిరిజన కార్పొరేషన్ మేనేజర్ సమ్మయ్య, సివిల్ సప్లై డిప్యూటీ తహసిల్దార్ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.