ముస్లింల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

ముస్లింల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

రంజాన్ కిట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే శంకర్ నాయక్

కేసముద్రం/గూడూరు, ముద్ర:  ముస్లింల అభివృద్ధికి, సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, స్వాతంత్రం సిద్ధించినప్పటి నుంచి ఓటు బ్యాంకు గానే పరిగణించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సీఎం కేసీఆర్ సమున్నత స్థానం కల్పించారని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు, కేసముద్రం మండలాల్లో ముస్లింలకు రంజాన్ సందర్భంగా పండగ సామాగ్రి కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడక ముందు ముస్లింలను ఓటు బ్యాంకు గానే గత పాలకులు పరిగణించారని, సీఎం కేసీఆర్ పరిపాలనలో ఇప్పుడు అన్ని వర్గాల వారికి అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందించి సమాజంలో గుర్తింపు తెచ్చారని కొనియాడారు.

ప్రతి కుటుంబానికి ఏదో ఒక లబ్ధి చేకూరే విధంగా సంక్షేమ పథకాలను అమలు చేయడం దేశంలో ఎక్కడా లేదని, ఒక్క తెలంగాణలోనే ఉందన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పింఛన్లు, రైతుబంధు, రైతు బీమా తదితర పథకాలతో పాటు పేదల అభ్యున్నతే లక్ష్యంగా, గర్వంగా తలెత్తుకునే విధంగా సీఎం కేసీఆర్ అహర్నిశలు పేదల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని కొనియాడారు. మన బాగోగులు పట్టించుకుంటున్న ప్రభుత్వానికి అండగా నిలవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ముస్లిం కుటుంబాలకు షాదీ ముబారక్ చెక్కులను, రంజాన్ కిట్లను అందజేయడంతో పాటు కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు ఈ కార్యక్రమంలో గూడూరు, కేసముద్రం ఎంపీపీలు సుజాత,  చంద్రమోహన్, జడ్పిటిసి శ్రీనాథ్ రెడ్డి, కేసముద్రం మార్కెట్ చైర్మన్ సుహాసిని, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు ఎండీ ఖాసీం, తహాసిల్దార్లు ఫరీదుద్దీన్, అశోక్ కుమార్, నజీర్ అహ్మద్, ప్రవీణ్ కుమార్, నవీన్ రెడ్డి, లక్ష్మణరావు, తదితరులు పాల్గొన్నారు.