సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 'పద్యసౌరభం' పుస్తకావిష్కరణ

సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 'పద్యసౌరభం' పుస్తకావిష్కరణ
సిద్దిపేట, ముద్ర ప్రతినిధి: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల,సిద్దిపేటలో గురువారం తెలుగు  విభాగం ఆధ్వర్యంలో  'పద్య సౌరభం'  పద్య కవిత సంపుటి పుస్తకవిష్కరణ కార్యక్రమాన్ని  నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కళాశాల ప్రిన్సిపాల్ డా. సి.హెచ్. ప్రసాద్ పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను చదివిన, ఉద్యోగం చేస్తున్న కళాశాల నుండి పుస్తకం ఆవిష్కరించడం విద్యార్థులకు సాహిత్య పరమైన స్ఫూర్తిని అందించడమే అవుతుందని తెలిపారు, వేల సంవత్సరాల నుండి భారత దేశంలో మిళితమైన పద్యం, మరుగున పడుతున్న సమయంలో పద్యాన్ని ఆదరించి, గౌరవాన్ని అందించడం గొప్ప విశేషమని అన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన  కళాశాల తెలుగు విభాగాధిపతి డా. ఎస్  మహేందర్ మట్లాడుతూ తెలుగు విభాగం ఆధ్వర్యంలో వివిధ ప్రక్రియల్లో విద్యార్థుల నుండి ఉపాధ్యాయుల నుండి పుస్తకావిష్కరణలు జరిగాయని అంతే కాకుండా తెలుగు  విభాగం శ్రీ కె వి రాఘవాచార్య స్మారక సాహిత్య పీఠం నుండి అంతర్జాతీయ ప్రామాణికతను కల్గిన పుస్తకాలల్లో భాగంగా ఈ పద్య కావ్యం ఆవిష్కరించడం సంతోష దాయకం అని అన్నారు.

పుస్తక సమీక్షలు ప్రభుత్వ మహిళా కళాశాల కరీం నగర్ కు చెందిన డా.మట్టా సంపత్ కుమార్   రెడ్డి పద్య సౌరభం గురించి మాట్లడుతూ తెలంగాణా పల్లె సౌరభం అంతా పుస్తక రూపంలో కనబడుతుందని, పుట్టిన, పెరిగిన, చదివిన, ఉద్యోగం చేస్తున్న సమయాలల్లోని తన భావాలను  పద్యాలలో వ్యక్తీకరించడం ముదావహం అన్నారు. గౌరవ అతిథి, సిద్దిపేట డిగ్రీ కళాశాల విశ్రాంత తెలుగు అధ్యాపకులు, పుస్తకం ఆవిష్కరణ చేసిన డా.టేకులపల్లి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ తన వద్ద విద్యనభ్యసించిన శిష్యుడు పుస్తక రచయితగా ఎదగడటం సంతోషమని అన్నారు. ఆనంతరం పుస్తకరచయిత డా. రాజిరెడ్డి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తన స్నేహితుల సాహచర్యం వల్ల, ఆచార్యుల వల్ల పద్యాలు రాయడం ప్రారంభించానని, జానపదం, సంప్రదాయం రెండూ మనుగడకు ఎంతో ముఖ్యమని,అందులో జానపదం నిర్మాలిన్యం అని అందుకే నాకీ పద్య రచన అబ్బిందని,తనతొలి పుస్తకమైన పద్యసౌరభంను తన తల్లదండ్రులు తార బాల్ రెడ్డి లకు అంకితం చేస్తున్నానని అన్నారు.

తనకు అనునిత్యం ప్రోత్సాహాన్ని అందిస్తున్న గరిపల్లి అశోక్ నకు మొదటి పుస్తకాన్ని అందించాడు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్  డా.హుస్సేన్, ఐ.క్యు.ఎ.సి. కో ఆర్డినేటర్ డా. మధుసూధన్, అకడమిక్ కో ఆర్డినేటర్ డా.గోపాల సుదర్శనం, అకాడమిక్ సెల్ కోఆర్డినేటర్ డా.భవాని, పీజీ కోఆర్డినేటర్ డా.పి. అయోధ్య రెడ్డి, డా .పల్లవి, డా.వాసం శ్రీనివాస్,డా. శ్రీనివాస్,డా.మల్లేశం, మహేశ్వరి,డా.బూర్ల చంద్రశేఖర్,వివిధ కళాశాలల అధ్యాపకులు,తెలుగు విభాగం అధ్యాపకులు  చక్రహరి రమణ,రామస్వామి, నరేష్, వేణు, శైలజ, భాగ్యమ్మ, నర్సింలు,నరేష్,సురేష్,మంజుల, కవి పప్పుల రాజిరెడ్డి అధ్యాపక సిబ్బంది,విద్యార్ధులు,మిత్రులు,కుటుంబ  సభ్యులు  పాల్గొన్నారు.