టార్గెట్ @ 345 కోట్లు

టార్గెట్ @ 345 కోట్లు

డిటిసి మామిండ్ల చంద్ర శేఖర్ గౌడ్

ముద్ర ప్రతినిధి కరీంనగర్ : రవాణా శాఖ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కు 2023-24 వార్షిక ఆదాయ లక్ష్యాన్ని 345 కోట్లు నిర్దేశించినట్లు  డిప్యూటి ట్రాన్స్ పోర్ట్ కమీషనర్ మామిండ్ల  చంద్ర శేఖర్ గౌడ్ తెలిపారు. రవాణా శాఖ కార్యదర్శి  శ్రీ శ్రీనివాస రాజు IAS  రాష్ట్ర వ్యాప్త రవాణా శాఖధికారుల తో నిర్వహించిన  వీడియో కాన్ఫరెన్స్ లో ఉమ్మడి కరీంనగర్ అధికారులు  పాల్గొన్నారు. ఈ  సందర్బంగా ఉమ్మడి కరీంనగర్ 2022-23 సంవత్సరానికి 303 కోట్లు ఆదాయాన్ని సాధించడం పట్ల రవాణా శాఖా ధికారులను  అభినందించారు. 2023-24 సంవత్సరానికి  సైతం రెట్టింపు ఉత్సాహం  తో పని చేసి ప్రభుత్వం నిర్దేశించిన 345 కోట్ల ఆదాయ లక్ష్యాన్ని చేరుకొవడం లో రవాణా శాఖధికారులందరు కృషి చేయాలని ఆదేశించారు.

కరీంనగర్ జిల్లాకు 169 కోట్లు
పెద్దపల్లి జిల్లా కు 80 కోట్లు జగిత్యాల జిల్లా కు 58 కోట్లు రాజన్న సిరిసిల్ల జిల్లాకు 38 కోట్లు మొత్తం గా ఉమ్మడి కరీంనగర్ జిల్లా కు 345 కోట్లు ఆదాయాన్ని నిర్దేశించినట్లు డి టి సి చంద్ర శేఖర్ గౌడ్ తెలిపారు. వాహన దారులకు మెరుగైన సేవలు  అందించడం తో  పాటు  ప్రభుత్వం నిర్దేశించిన  ఆదాయ లక్ష్యాన్ని సాధించడానికి కృషి చేస్తామని చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు.  ఈ  వీడియో కాన్ఫరెన్స్ లో  ఉమ్మడి కరీంనగర్ జిల్లా డి టి సి చంద్ర శేఖర్ గౌడ్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లా ల రవాణా శాఖ అధికారులు రంగారావు, శ్యామ్ నాయక్, కొండల్ రావు తో పాటు  ఎం వి ఐ  లు అల్లె శ్రీనివాస్, గౌస్ పాషా, నాగ లక్ష్మి, సిరాజ్, మసూద్ అలీ తదితరులు పాల్గొన్నారు.