బీజేపీ పార్టీ కోసం అనునిత్యం పని చేయాలి

బీజేపీ పార్టీ కోసం అనునిత్యం పని చేయాలి

తరుణ్ చుగ్ ను కలిసిన హుజురాబాద్  అసెంబ్లీ కన్వీనర్

ముద్ర ,వీణవంక:  జైలు నుండి విడుదలైన   బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కి సంఘీభావం తెలపడానికి  బీజెపి అధిష్టానం ఆదేశించడంతో  తెలంగాణ రాష్ట్ర బీజేపీ  ఇంచార్జ్ తరుణ్ చుగ్  బండి సంజయ్ నివాసానికి వచ్చారు.ఈ సందర్భంగా హుజురాబాద్ అసెంబ్లీ కన్వీనర్ మాడ గౌతం రెడ్డి తో తరుణ్ చుగ్  మాట్లాడారు. తెలంగాణ లో రాబోయే రోజుల్లో బీజేపీ  అధికారంలోకి రావడానికి  దగ్గరగా ఉన్నామని, పార్టీ కోసం అనునిత్యం పనిచేయాలని నాయకులకు తరుణ్ చుగ్  సూచించారు.ఈ కార్యక్రమంలో నాయకులు పుప్పాల రఘు, జిల్లా కిసాన్ మోర్చా కార్యదర్శి మారం తిరుపతి  రెడ్డి, అఖిల్ ,మద్దుల ప్రశాంత్ పటేల్, శ్రీ పాల్ రెడ్డి లు ఉన్నారు.