జిపి కార్మికుల సమ్మెకు న్యాయవాదుల మద్దతు

జిపి కార్మికుల సమ్మెకు న్యాయవాదుల మద్దతు

శంకరపట్నం ముద్ర జులై 21 : గ్రామపంచాయతీ కార్మికుల సమ్మెకు పలువురు న్యాయవాదులు మద్దతు తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద కార్మికులు చేస్తున్న సమ్మె 16వ రోజుకు చేరుకున్నది . జేఏసీ రాష్ట్ర నాయకత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు పిలిచి కార్మికుల పర్మినెంట్ విషయం,కనీస వేతనం అమలు చేయాలని న్యాయవాది బోనాల శ్యాంసుందర్ ఆరోపించారు. పిఎఫ్ ఈఎస్ఐ ప్రమాద బీమా కార్మికుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని సమ్మె విరమించే దిశగా కార్మికులకు న్యాయం చేయాలనిఆయన కోరారు. మరో న్యాయవాది కొరిమి నరసింహస్వామి మాట్లాడుతూ సమ్మెకు తాను మద్దతు ఇచ్చినట్లు ప్రకటించారు. సామాజిక కార్యకర్త కొరిమి వెంకటస్వామి సమ్మెకు మద్దతు పలికారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా నాయకుడు బోర్ల మొగిలి, తదితరులు పాల్గొన్నారు