ముద్ర కథనం వల్ల దాతృత్వం చాటుకున్న కలెక్టర్

ముద్ర కథనం వల్ల దాతృత్వం చాటుకున్న కలెక్టర్

ముద్ర, జమ్మికుంట:-ముద్ర కథనం వల్ల స్పందించి బాధిత కుటుంబానికి 25 వేల ఆర్థిక సహాయం అందించిన కలెక్టర్ దొద్దే ఆంజనేయులు.ఎంత ఎత్తుకు ఎదిగిన తన సొంత ఊరు, ఊరి ప్రజలను మర్చి పోకుండా తనకు వీలైన సహాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఓ ఐఏఎస్ అధికారి. కరీంనగర్ జిల్లా అబాది జమ్మికుంటకు చెందిన దొడ్డె ఆంజనేయులు, ప్రస్తుతం జార్ఖండ్ రాష్ట్రంలో దుంకా జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్నారు. రెండు రోజుల క్రితం జమ్మికుంట పట్టణం కొత్తపల్లి కి చెందిన షహీద అను ఒంటరి మహిళ తన కొడుకు తీవ్ర అనారోగ్యం పాలు కావడంతో వైద్యం చేయించడానికి ఆర్థిక స్థోమత లేక దాతల సహాయం కోరింది.

ఈ విషయం సంభందించిన ముద్ర  పత్రికల్లో ప్రచురితం కావడం మరియు ఫేస్ బుక్ లో పెట్టడంతో విషయం తెలుసుకున్న ఆంజనేయులు వెంటనే స్పందించి 25,000 వేల రూపాయలు సహాయం కోసం ఎదురు చూస్తున్న బాధితుని తల్లి బ్యాంక్ అకౌంట్ కు పంపి తన దాతృత్వం చాటుకున్నారు. తన కొడుకు వైద్య సహాయానికి ఆర్థిక సహాయం చేసిన కలెక్టర్ ఆంజనేయులుకు తల్లి షహీద కృతజ్ఞతలు తెలియజేసింది. షహీద మాట్లాడుతూ తన కొడుకు ప్రాణాల్ని కాపాడు కోగలనన్న ధైర్యం కలిగిందని, తన బిడ్డ వైద్య ఖర్చులకు సహాయం చేస్తున్న దాతలు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియ జేశారు.