నా భర్తకు ప్రాణదానం చేయండి - ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్న పేద కుటుంబం

నా భర్తకు ప్రాణదానం చేయండి  - ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్న పేద కుటుంబం

శంకరపట్నం, ముద్ర  : శంకరపట్నం మండల పరిధిలోని కన్నపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి లారీ ఢీకొనగా ప్రమాదానికి గురై ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. కుటుంబ సభ్యులు తన భార్య రజిత తెలిపిన వివరాల ప్రకారం కన్నాపూర్ గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన దేవునూరి సమ్మయ్య అలుగునూర్ లోని ఓ పెట్రోల్ బంకులు పనిచేస్తున్నారు. గురువారం పని ముగించుకుని తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో చెంజర్ల గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతొ తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు గమనించి కరీంనగర్ లోని  ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.తనకి ముగ్గురు ఆడపిల్లలని,కుటుంబాన్ని పోషించే యజమాని ప్రమాదానికి గురవడంతో దిక్కుతోచని పరిస్థితిలో తన కుటుంబం ఉందని స్థానిక ప్రజాప్రతినిధులు, దాతలు స్పందించి సమ్మయ్యకు నాణ్యమైన వైద్యాన్ని అందించి తన కుటుంబాన్ని ఆదుకోవాలని వేడుకుంటున్నారు. నా భర్తకు ప్రాణదానం, ఆర్థిక సాయం అందించేవారు ఫోన్ పే,గూగుల్ పే నెంబర్ 9177400431. ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడానికి 9030112069 సంప్రదించాలని వేడుకుంటున్నారు.