సహాయం కోసం ఓ తల్లి ఎదురుచూపు

సహాయం కోసం ఓ తల్లి ఎదురుచూపు

ముద్ర, జమ్మికుంట జమ్మికుంట పట్టణంలోనికొత్తపల్లికి చెందిన ఒంటరి మహిళ తన కొడుకు ను బ్రతికించుకోవడానికి సహాయం కోసం ఎదురుచూస్తోంది. కొత్తపల్లి కి చెందిన షహీదా కుమారుడు సోను (16 సంవత్సరాలు) తీవ్ర మానసిక అనారోగ్యంతో హనుమకొండ ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. షహీదా ఇటీవల కాలంలో తన భర్త మొయినుద్దీన్ ను ఒక యాక్సిడెంట్ లో కోల్పోయింది. మైనుద్దీన్ ఎలక్ట్రిషన్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. తండ్రి మరణంతో సోను తీవ్ర మానసిక ఒత్తిడి కి లోనై అనారోగ్యం పాలయ్యాడు.

షహీద తన భర్త మరణంతో కుటుంబ పోషణ భారంగా మారిన సందర్భంలో తన కుమారుడు తీవ్ర మానసిక అనారోగ్యం కావడంతో తనను మరింత కృంగ దీసింది. కొంతకాలం తన కష్టంతో వైద్యం చేయించినా, నయం కాకపోవడంతో పాటు వైద్యులు కొన్ని నెలల పాటు చికిత్స అవసరం అని తెలపడంతో మెరుగైన చికిత్స కోసం ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తోంది. దాతలు ఎవరైనా ముందుకు వచ్చి తన కొడుకు ప్రాణాల్ని కాపాడాలని వేడుకుంటుంది. సహాయం చేయాలనుకొనే దాతలు ఫోన్ పే లేదా గూగుల్ పే నంబర్ 7416264356 (రహీమ్) కు లేదా క్రింది బ్యాంక్ అకౌంట్ కు 026312120000661 MD SHAHEDA UBINO802638 Union Bank Jammikunta