శ్రద్ధగా చదువుకుంటే బంగారు భవిష్యత్తు మీదే...

శ్రద్ధగా చదువుకుంటే బంగారు భవిష్యత్తు మీదే...
  • మంత్రి మల్లారెడ్డి...

మేడ్చల్ టౌన్,ముద్ర:నాలుగు సంవత్సరాల పాటు కాలాన్ని వృధా చేయకుండా శ్రద్ధగా చదువుకుంటే ఉన్నత శిఖరాలనుఅధిరోహించవచ్చని నూతనంగా సిఎంఆర్ ఐటీ  కళాశాలలో చేరిన విద్యార్థులకు మంత్రి మల్లారెడ్డి సూచించారు.శుక్రవారం సీఎంఆర్ ఇంజనీరింగ్ టెక్నాలజీ కళాశాలలో జరిగినటువంటి ఓరియంటేషన్ డే కార్యక్రమానికి మంత్రి మల్లారెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎంఆర్,మల్లారెడ్డి విద్యాసంస్థల్లో విద్యనభ్యసించిన వారు దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా పేరుగాంచిన సంస్థల్లో ఉద్యోగాలు సాధించారని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. నాలుగు సంవత్సరాల పాటు విద్యార్థులు కాలాన్ని వృధా చేయకుండా చదువుపై శ్రద్ధ  పెట్టి భవిష్యత్తును బంగారు మయం చేసుకోవాలని మంత్రి మల్లారెడ్డి విద్యార్థులకు ఉద్బోదించారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ జంగారెడ్డి,ప్రిన్సిపల్ శ్రీనివాస్, సీఎంఆర్ విద్యాసంస్థల డైరెక్టర్ గోపాల్ రెడ్డి,శ్రీశైలం రెడ్డి, హెచ్ఓడిలు,ఉపాధ్యాయులు, విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.