రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ రాక - ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ 

రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ రాక - ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ 

ముద్ర ప్రతినిధి కరీంనగర్ : రేపు కరీంనగర్ జిల్లాలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పర్యటించనున్నారు. రామడుగు మండలంలో ఇటీవల కురిసిన వడగండ్ల వానతో తీవ్రంగా పంట నష్టపోయిన  రైతులను కలిసి పరిస్థితిని సమీక్షించనున్నారు. ఇప్పటికే అధికారులు పంట నష్టం పై నివేదిక తయారు చేశారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించనున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ రాక సందర్భంగా జిల్లా కలెక్టర్ పర్యటన ఏర్పాటులను పరిశీలించారు. బుధవారం పోలీస్ కమిషనర్, అదనపు కలెక్టర్లతో కలిసి రామడుగు మండలంలో పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు.  పంటనష్టంపై సమగ్ర నివేదికతో అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి జిల్లాకు చేరుకొని తిరిగి వెళ్లెవరకూ పక్కా ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని తెలిపారు. పోలీస్ కమిషనర్ సుబ్బారాయుడు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. అదనపు కలెక్టర్లు జి.వి. శ్యామప్రసాద్ లాల్, గరిమ అగర్వాల్, వ్యవసాయ అధికారి శ్రీధర్, ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాస్, ఇరిగేషన్ అధికారులు, ఇతర అధికారులు పాల్గొని ఏర్పాట్లను సమీక్షించారు