అవార్డులు అందుకున్న పోలీసులను అభినందించిన సిపి

అవార్డులు అందుకున్న పోలీసులను అభినందించిన సిపి

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : ఉత్తమ ప్రతిభ కనబరచి అవార్డులు పొందిన పోలీసు అధికారులను కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఎల్ సుబ్బారాయుడు అభినందించారు. ఇటీవల రవీంద్రభారతిలో వివిధ రకాల అవార్డులు, పతకాల ప్రధానోత్సవం కార్యక్రమం జరిగింది. కరీంనగర్ రూరల్ సిఐ విజ్ఞాన్ రావు (ఉత్తమ సేవ) సిఏఆర్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ (పరిపాలన) మోడెం సురేష్ (కేంద్ర హోంశాఖ మంత్రి మెడల్) టూ టౌన్ హెడ్ కానిస్టేబుల్ కె శ్రీనివాస్ (ఉత్తమ సేవ) సిఎస్బి కానిస్టేబుల్ నాగమల్లి శ్రీనివాస్ (ఉత్తమ సేవ) ఆర్ఎస్ఐ రాజు (ఆంత్రిక్స్ సురక్ష పతకం) లను పొందిన విషయం విధితమే.

వీరందరిని శుక్రవారం సిపి తన చాంబర్లో అభినందించారు.  ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ఇదే స్ఫూర్తితో పనిచేస్తూ మరిన్ని రివార్డులు, అవార్డులు సాధించాలని ఆకాంక్షించారు. సమర్థవంతమైన సేవలు ద్వారా పోలీసులకు గుర్తింపు లభిస్తుందని చెప్పారు.