యాదాద్రిలో చిరుధాన్యాల ప్రసాదం ప్రారంభం..

యాదాద్రిలో చిరుధాన్యాల ప్రసాదం ప్రారంభం..
  • ప్రారంభించిన దేవదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

యాదగిరిగుట్ట, ముద్ర న్యూస్ : యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని బుధవారం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంత కండ్ల జగదీశ్వర్ రెడ్డి దర్శించుకున్నారు. మంత్రులకు దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, ఆలయ యువఈఓ గీతారెడ్డి, అర్చకులు ఘనంగా స్వాతం పలికారు. అనంతరం చిరుధాన్యాల ప్రసాదం, బంగారం, వెండి నాణాల విక్రయశాల,  ఆన్లైన్ టికెట్ సేవలను ప్రారంభించారు. బంగారు డాలర్ 3 గ్రాములు రూ. 21,000 నిర్ణయించంగా వెండి 5 గ్రాములు 1.000/- రూపాయలు, మిల్లెట్ ప్రసాదం 80 గ్రాములు రూ. 40/- రూపాయలుగా దేవస్థానం నిర్వహించింది.