కుట్ర పూరిత రాజకీయాలు చేస్తున్న బిజెపి

కుట్ర పూరిత రాజకీయాలు చేస్తున్న బిజెపి
  •  మోడీ చెప్పినట్టు ఈడీ చేస్తుంది
  •  ఎమ్మెల్సీ కవితను వేధిస్తున్నారు
  •  చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్

ముద్ర ప్రతినిధి కరీంనగర్ :బిజెపి ఈడి ని అడ్డం పెట్టుకొని కుట్రపూరిత రాజకీయాలు చేస్తుందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆరోపించారు.

కరీంనగర్ జిల్లా కేంద్రంలో శుక్రవారం రవిశంకర్ పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ

ఎమ్మెల్సీ కవిత ఎలాంటి తప్పు చేయలేదు అన్నారు. మోడీ అమిత్ షా లు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ లతో కెసిఆర్ ను భయపెట్టాలని చూస్తున్నారని స్పష్టం చేశారు. కెసిఆర్ ని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక అక్రమ కేసులతో కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.

మహిళను 9 గంటల పాటు విచారణ పేరుతో మానసికంగా వేధించడం ఎంతవరకు సమంజసం అన్నారు. అంబానీ, ఆదాని, మాల్యాలపై ఈడి, ఐటి రైడ్స్ ఎందుకు చేయరని ప్రశ్నించారు. నళిని ని ఇంట్లో విచారించినట్లు కవితను కూడా ఇంట్లోనే విచారించాలన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలులో అడ్డంగా దొరికిన బిఎల్ సంతోష్ కుమార్ సుప్రీంకోర్టు కెళ్ళి తప్పించుకున్నారన్నారు.

24న సుప్రీం కోర్టులో కేసు తర్వాత ఎలాంటి విచారణకైనా సహకరిస్తామని కోరినప్పటికీ నేరం చేసినట్లు బాహ్య ప్రపంచానికి చూపించే కుట్ర జరుగుతుందన్నారు.

 ఎమ్మెల్యేలు, మంత్రుల పై దాడులు చేసి పార్టీ మారేలా ఒత్తిడి చేసి రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యం చేత ఎన్నుకోబడిన తొమ్మిది రాష్ట్రాల ప్రభుత్వాలను కూలగొట్టిన నీచ చరిత్ర బిజెపి ది అన్నారు. చాయ్ అమ్మినట్లు దేశ సంపదను అమ్మేస్తున్నారని మండిపడ్డారు. ఈ సమావేశంలో టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జివి రామకృష్ణారావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్, నగర అధ్యక్షుడు చల్ల హరి శంకర్ డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ముదిగంటి సురేందర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు వీర్ల వెంకటేశ్వరరావు, , ఎంపీపీలు పర్లపల్లి వేణుగోపాల్, చిలుక రవీందర్, మేనేని స్వర్ణలత రాజనర్సింగారావు, కలిగేటి కవిత లక్ష్మణ్, జడ్పిటిసిలు పుల్కం అనురాధ నరసయ్య, మాచర్ల సౌజన్య వినయ్, పునుగొటి ప్రశాంతి కృష్ణారావు, కత్తెరపాక ఉమా కొండయ్య తదితర నాయకులు పాల్గొన్నారు.