బీరప్ప దేవాలయానికి 10 లక్షలు

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : స్థానిక విద్యానగర్, నవీన కుర్మ వాడ, సంతోష్ నగర్, రాంనగర్ కరీంనగర్ లోని శ్రీ బీరప్ప -మహంకాళ్ళమ్మ దేవాలయం కాంపౌండ్ వాల్ నిర్మాణం కొరకు మంత్రి గంగుల కమలాకర్ తమ నిధుల నుండి 10 లక్షల రూపాయలు కేటాయించారు. ఈ సందర్భంగా మంత్రిని శ్రీ బీరప్ప -మహంకాళ్లమ్మ సేవా కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించిన్నారు. ఈ కార్యక్రమానికి మేయర్ సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూప రాణి-హరి శంకర్, కార్పొరేటర్ ఐలెందర్ యాదవ్ హాజరైనారు.

ఈ కార్యక్రమంలో బీరప్ప మహంకాళ్ళమ్మ సేవా కమిటీ పెద్ద కురుమ కర్రె అనిల్ కుమార్, అధ్యక్షులు బీర్ల బీరయ్య, కర్రె ప్రవీణ్ కుమార్, కర్రె రాజు, బీర్ల నర్సయ్య, బీర్ల పెద్ద కనుకయ్య, ఎలుకపెల్లి బీరయ్య, కర్రె లింగయ్య, దయ్యాల రాజయ్య, కచ్చు రాజయ్య, అమరగొండ రవి, ఏనుగుల రవి,ఓట్టే రాజు,మ్యాకల రాజ్ కుమార్ మరియు కుల బంధావులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.