ఫేక్ సర్టిఫికెట్లతో హోం లోన్స్ 

ఫేక్ సర్టిఫికెట్లతో హోం లోన్స్ 

18మంది సభ్యుల ముఠా అరెస్టు
ముద్ర, తెలంగాణ బ్యూరో : నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి హోం లోన్స్ ఇప్పిస్తున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. 18మంది సభ్యులు  ఒక ముఠాగా ఏర్పడి ప్రభుత్వ అధికారుల సంతకాలతో, వారి హోదా పేరుపై రబ్బర్ స్టాంప్ లు తయారుచేసి మోసాలకు పాల్పడుతున్నారు. వీరిపై రెండు కేసులను నమోదు చేశారు. 1180 నకిలీ సర్టిఫికెట్లు, 687 ఫేక్ రబ్బర్ స్టాంపులు, 10 లాప్ టాప్ లు కలిపి మొత్తం రూ.10కోట్ల విలువు చేసే సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాలపూర్, కూకట్ పల్లి ఎస్ఓటీ పోలీసులు ఈ కేసును ఛేదించారు. ఈ ముఠాకు గంటా రంగారావు అనే వ్యక్తి నాయకుడిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 2015నుంచి ఈ ముఠా కార్యకలాపాలను సాగిస్తుందని తెలిపారు.

మొత్తం మూడు బృందాలుగా ఈ ముఠా పనిచేస్తుందని చెప్పారు. ఫేక్ రబ్బర్ స్టాంపులు తయారు చేయడంలో ఒక ముఠా, ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర  తదితర బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటారని తెలిపారు. మరో ముఠా బిజినెస్ లోన్లు ఇప్పిస్తుంది. లేబర్ లైసెన్స్, జీహెచ్ఎంసీ ట్రేడ్ సర్టిఫికెట్, ఇన్ కమ్ సర్టిఫికేట్లను తయారు చేస్తుంది. వీటి ద్వారా బిజినెస్ లోన్లు ఇప్పిస్తుంటారు. ఫేక్ లే అవుట్ కి రూ.3వేలు, బ్యాంకు రుణాలు కోసం సర్టిఫికెట్లను ఇప్పించేందుుక రూ.5వేలు తీసుకుంటారు. ఈ ముఠాకు సహకరిస్తున్న ఏజెంట్లు, బ్యాంకర్లు, అడ్వకేట్ల పాత్రపై ఆరా తీస్తున్నామని సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వెల్లడిచారు.