రూ. 655 కోట్ల ఫైటర్జెట్మిస్సింగ్!
సమాచారం అందించాలని ప్రజలకు రక్షణశాఖ విజ్ఞప్తి!
న్యూఢిల్లీ: అమెరికాకు సౌత్ కరోలినా రాష్ట్రంలోని బ్యూ ఫోర్ట్ ఎయిర్ స్టేషన్ నుంచి అమెరికా సైన్యానికి చెందిన ఫైటర్ జెట్ ఎఫ్–35మిస్సింగ్ అయ్యింది. పైలెట్ విమానాన్ని నడుపుతుండగా సాంకేతిక లోపం తలెత్తింది. దీన్ని సరిచేయడంలో పైలెట్, గ్రౌండ్లెవెల్ సిబ్బంది విఫలమవడంతో ఆఖరి క్షణంలో పైలెట్విమానం నుంచి దూకేసి ప్రాణాలు దక్కించుకున్నాడు. కానీ ఆ ఫైటర్‌జెట్ ఆచూకీ మాత్రం తెలియడం లేదని అమెరికా రక్షణ శాఖ తీవ్ర వెతుకులాట పనిలో పడింది. ఈ విషయం కాస్త వార్తా మాధ్యమాల ద్వారా దావానంలా వ్యాపించడంతో అమెరికా రక్షణశాఖపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రూ.665 కోట్ల ఫైటర్జెట్కు బ్లాక్‌బాక్స్, సిగ్నల్బాక్స్ వంటి సాంకేతికతను జోడించలేదా? అని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఈ ఫైటర్ జెట్జాడ ప్రజలకు తెలిస్తే సమాచారం అందించాలని అమెరికా కోరింది. మరోవైపు ఫెడరల్ ఏవియేషన్ రెగ్యులేటర్‌తో కలిసి పోర్టు సిటీ అయిన చార్లెస్టన్‌లో ఫైటర్ జెట్ ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు సైనిక అధికారులు తెలిపారు. చార్లెస్టన్ నగరంలో ఉన్న రెండు సరస్సుల్లో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఈఎఫ్–35 ఫైటర్ జెట్‌ను లాక్‌హీడ్ మార్టిన్ అనే సంస్థ తయారు చేసింది.