ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఆ పార్టీ జెండా ఎగరవేస్తా

ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఆ పార్టీ జెండా ఎగరవేస్తా

ముద్ర, జమ్మికుంట:-కరీంనగర్ జిల్లా  జమ్మికుంట పట్టణం కొత్తపల్లిలో మాజీ జెడ్పిటిసి అరకాల వీరేశలింగం  నివాసంలో మీడియా సమావేశంలో వీరేశలింగం మాట్లాడుతూ బిఆర్ఎస్ ఎమ్మెల్యే గా అవకాశం ఇవ్వాలని బిఆర్ఎస్ పార్టీలో సీనియర్ నాయకుని అని ఎమ్మెల్యే క్యాండిడేట్ అర్హున్ని అని తెలిపారు. 2001 నుండి టిఆర్ఎస్ పార్టీ ఏర్పడడానికి కృషి చేశాను, కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే గా పోటీ చేశాను మళ్ళీ 2001లో అవకాశం ఇచ్చిన టిఆర్ఎస్ లో పార్టీలో చేరానని తెలిపారు. బిఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఈటెల ఉండగా ఆకాశం రాకపోగా, జడ్పిటిసిగా నన్ను ప్రజలు ఆదరించారు అని తెలిపారు.అ బిఆర్ఎస్ పార్టీ నుండి నాకు ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని లేనట్లయితే బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఏ పార్టీ అయినా సరే ఆ పార్టీ నుండి నుండి అవకాశం ఇస్తే ఆ పార్టీ నుండి పోటీ చేస్తానని తెలిపారు. బిఆర్ యస్ పార్టీలో బీసీనాయకులను అణగదొక్కుతున్నారు పార్టీలో రెడ్డి ,వెలుమల ఆదిపత్యం నడుస్తుందని బీసీలకు కేసిఆర్ ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.