ఈనెల 31న గద్దపాకలో పౌర హక్కుల దినోత్సవం 

శంకరపట్నం ముద్ర జులై 30 :ఈనెల 31న మండల పరిధిలోని గద్దపాక గ్రామంలో పౌర హక్కుల  దినోత్సవం జరుగుతుందని తహసిల్దార్ గూడూరి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరుగుతుందని ఆయన చెప్పారు. షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల అంటరానితన నిర్మూలనపై చర్చించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశానికి మండల ప్రభుత్వ అధికారులు, అంబేద్కర్ సంఘాలు, ప్రజా ప్రతినిధులు హాజరు కావాలని ఆయన కోరారు.