అకట్టుకున్న మానస వార్షికోత్సవ వేడుకలు

అకట్టుకున్న మానస వార్షికోత్సవ వేడుకలు

ముద్ర ప్రతినిధి, జగిత్యాల : జగిత్యాల పట్టణంలోని మానస ఎక్సల్లెన్స్ స్కూల్  ఐఐటి ఫౌండేషన్  ఆధ్వర్యంలో కల్చరల్ డిలైట్ పేరుతో నిర్వహించిన వార్షికోత్సవ వేడుకలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. విద్యార్థులు జానపద, పేరిణి నృత్యాలు, శివతాండవం, దశావతారాల ప్రదర్శన, వండర్ కిడ్స్, హులహుప్ డాన్స్, మహిళ ఉపాధ్యాయులు, విద్యార్థినిలు వారి తల్లులతో  చేసిన నృత్యం  ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేశాయి.

కన్న పిల్లల పై తండ్రి ప్రేమ మమకారం కన్న కూతురు, కొడుకుల పై తల్లికి ఉండే అమృతమైన ప్రేమ గురించి  మగువల ప్రాముఖ్యతని తెలిపే  నాటికలు చూపరులను ఆకట్టకుంటున్నాయి. హనుమాన్ చాలీసాఫై  చేసిన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణ గా నిలించింది. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు శ్రీధర్ రావు , బి.హరిచరణ్ రావు, జె.హరిచరణ్ రావు, రజిత రావు, మౌనిక రావు , అజిత రావు, సుమన్ రావు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లి తండ్రులు పాల్గొన్నారు.