వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో తూకంలో మోసం.

వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో తూకంలో మోసం.

మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్.
*రైతులకు అండగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ.

సారంగాపూర్ ముద్ర:సారంగాపూర్ మండలంలోని బట్ట పెళ్లి గ్రామంలో సింగిల్ విండో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వారి ధాన్యం కొనుగోలు కేంద్రంలో తూకంలో మోసం జరిగినట్లు రైతులు గుర్తించారు. ప్రతి ఒక్క బస్తా 41నర కిలోలు వరకు జోకాల్సి ఉండగా నిబంధనలకు విరుద్ధంగా ప్రతి ఒక్క బస్తా నాలుగు నుండి ఐదు కిలోలు అధికంగా జోకుతూ రైతులను మోసగిస్తున్నట్లు తెలుస్తోంది. అధిక బరువుతో జోకిన విషయాన్ని గుర్తించిన రైతులు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ను కలిసి సింగిల్ విండో వారి ధాన్యం కొనుగోలు కేంద్రంలో జరుగుతున్న మోసంపై వివరించారు. స్పందించిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సింగల్ విండో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి వరి ధాన్యం బస్తాలను వేరే ఒక కాంట పైన జొకగా రైతులను అధిక బరువుతో జోకుతూ రైతులను మోసగిస్తున్న విషయం బయటపడింది. వెంటనే జిల్లా కోపరేటివ్ అధికారికి ఫోన్ చేసి రైతులను మోసగిస్తున్న విషయం ఆయన దృష్టికి తీసుకువెళ్లి కొనుగోలు కేంద్రములలో అధిక బరువుతో జోకుతూ రైతులను మోసగిస్తున్న నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన వెంట కేడిసిసి బ్యాంక్ డైరెక్టర్ ముప్పాల రామచందర్ రావు, సారంగాపూర్ సింగిల్ విండో అధ్యక్షులు ఎలేటి నరసింహారెడ్డి, నాయకులు కొలుముల రమణ, ప్రేమానందం, సాయిలు, మధుకర్ తదితరులున్నారు.