కస్తూర్బా బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్...

కస్తూర్బా బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్...

8 మంది బాలికలకు అస్వస్థత....
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల పట్టణంలోని దరువు క్యాంపులో గల కస్తూర్బా బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ జరిగి 8 మంది విద్యార్థులు అస్వస్థత గురయ్యారు. విద్యార్థులను హుటాహుటిన ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించగా కోలుకుంటున్నారు. పాచిపోయిన రెండు, మూడు రోజుల భోజనం విద్యార్థులకు వడ్డించడంతో ఫుడ్ పాయిజన్ జరిగింది . ఆదివారం సాయంత్రం బయట నుంచి విద్యార్థులకు ఆహారాన్ని తీసుకొని వచ్చి వడ్డించారు. మరుసటి  రోజు పలువురు విద్యార్థులకు విరోచనాలు అయిన పాఠశాల ప్రిన్సిపాల్ కానీ సంబధిత ఆరోగ్య శాక అధికారులు కానీ పట్టించుకోలేదు.

అంతేకాకుండా ఉదయం ఇడ్లీలో ఆదివారం తెచ్చిన సాంబారు వడ్డించడం అలాగే మధ్యాహ్నం  కుడా వాటినే  వడ్డించడంతో సోమవారం నుంచి విద్యార్థులు అస్వస్థకు గురౌతు వచ్చారు . మంగళవారం కూడా నాణ్యమైన ఆహారం వడ్డించకపోవడంతో విద్యార్థులు భోజనం చేయక నిరసించిపోయారు. దీంతో తొమ్మిదో తరగతి చదువుతున్న వసంత ,పౌర్ణమి మరొక విద్యార్థిని స్పృహ కోల్పోయి పడిపోయారు. గమనించిన సహచర విద్యార్థులు కేకలు వేస్తూ అరవడంతో చుట్టుపక్కల వారు వచ్చి ఉన్నతాధికారులకు ఫోన్లో సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఎంఈఓ గాయత్రి వసతి గృహానికి వచ్చి అస్వస్థకు గురైన విద్యార్థులను ఆసుపత్రికి తరలించగ విద్యార్థులు కోలుకుంటున్నారు . ఇంత జరిగినా కూడా వసతి గృహ ప్రిన్సిపల్ మధులత అటువైపు రాకపోవడంతో అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.