మెట్టుపల్లిలో  రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని దగ్దం చేసిన బి ఆర్ ఎస్

మెట్టుపల్లిలో  రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని దగ్దం చేసిన బి ఆర్ ఎస్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: తెలంగాణ రాష్ట్రంలో ఉచిత కరెంట్ సరఫరాపై కాంగ్రెస్ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మెట్టుపల్లి పట్టణ కేంద్రంలో సబ్ స్టేషన్ వద్ద బిఆర్ఎస్ శ్రేణులు కలసి నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని దగ్దం చేశారు. ఈ సందర్భంగా బిఆర్ ఎస్  మాట్లాడుతూ తెలంగాణలో పచ్చదనం చూసి రేవంత్ రెడ్డి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. దేశానికి వెన్నెముక అయిన రైతును రాజు చేయాలని సీఎం కేసిఆర్ రైతుల కోసం మరే రాష్ట్రంలోనూ లేనివిధంగా రైతు సంక్షేమం కోసం  పథకాలను అమలు చేస్తున్నరన్నారు. రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్తు, కాళేశ్వరం, మిషన్‌ కాకతీయ ఇలా పలు రకాల రైతు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న తెలంగాణ దేశానికి రోల్‌మాడల్‌గా నిలిచిందన్నారు .తక్షణమే రైతులకు రేవంత్ రెడ్డి క్షమాపన చెప్పాలి అని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం లో టిఆర్ఎస్ పార్టీ పట్టణ కార్యదర్శి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కో-ఆప్షన్ సభ్యులు మార్గం గంగాధర్, కౌన్సిలర్లు అంగన్వాడీ పురుషోతం, బంగారుకల్లా కిషోర్, షేక్ నవాబ్, బత్తుల భారత్, అరిసె మురళి, జిమ్ జావీద్, ఆకుల ప్రవీణ్, ఓజ్జెల శ్రీను, మొరపు తేజ, జజాల  రాజగోపాల్, గజం రవి, ముంజ సత్యనారాయణ, షేక్ మొహమ్మద్, కారం శివ, ప్రణయ్ గౌడ్, పులి అరుణ్, పరిపెల్లి రమేష్, ద్యావతి నారాయణ, అశోక్, జెరిపోతుల బాబు తదితరులు పాల్గొన్నారు.