రైతు వ్యతిరేకి కాంగ్రెస్ పార్టీ..

రైతు వ్యతిరేకి కాంగ్రెస్ పార్టీ..
  • వైస్ ఎంపీపీ పిసరి భూమయ్య..
  • రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్దం...                                       

ముద్ర,రుద్రoగి:బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్,మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు బీఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దెగవత్ తిరుపతి ఆధ్వర్యంలో  వైస్ ఎంపీపీ పిసరి భూమయ్య పార్టీ నాయకులతో కలిసి రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ పై టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో తానా సభలో చేసినవ్యాఖ్యలు ఖండిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రoగి మండలంలోని మానాల గ్రామంలో గురువారం స్తూపం చౌరస్తాలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దెగవత్ తిరుపతి మాట్లాడుతూ ఉచితాలు వద్దంటూ రేవంత్ రెడ్డి రైతులకు పేదలకు అన్యాయం చేయాలని చూస్తున్నారని అన్నారు,మూడు ఎకరాల భూమికి మూడు గంటల కరెంట్ ఇస్తే చాలని అనడంలో రైతులు పండించే పంటలపై రేవంత్ రెడ్డి కి ఎంత అవగాహన కలిగి వున్నారో ప్రజలకు అర్థమవుతుందని అన్నారు.బీజేపీ నాయకులు మోటార్లు కు మీటర్లు పెట్టాలంటోంది, కాంగ్రెస్ 24గంటల విద్యుత్ వద్దు అంటోంది. ఈ రెండు పార్టీలు  ప్రజలను మోసం చేయాలని చూస్తున్నాయని పేర్కొన్నారు, కాంగ్రెస్ హయాంలో రాత్రి కరెంట్ వల్ల కరెంట్ షాక్ లు, పాము కాట్లతో రైతులు చనిపోయేవారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ గిరిజన గ్రామాల సర్పంచ్ లతో పాటు ప్యాక్స్ చెర్మెన్ ఏలేటి చిన్నారెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ బాధనవేని రాజారాం,ప్యాక్స్ డైరెక్టర్లు జుల భూమన్న,కోడూరి రమేష్,నరు నాయక్,రాజు, గ్రామశాఖ అధ్యక్షుడు నాయిని రాజేశం,గంగారెడ్డి,లక్కకుల రమేష్,తిక్క భూమన్న, కంటల మారుతి, గణపతి,జె అంజయ్య, గంగానర్సయ్య,స్వామి తదితరులు పాల్గొన్నారు