మాతృభాష పరిరక్షణకు పాటు పడాలి

మాతృభాష పరిరక్షణకు పాటు పడాలి
  • సంస్కృతికి,సాంప్రదాయనికి,విలువలను ప్రతిబింబబించేది  మాతృ భాష
  • తెలుగు భాష వైతాళికుడు కొమ్మర్రాజు బాషా పాండిత్యాన్ని అవపోసన పట్టిన ప్రజ్ఞాశాలి- మంత్రి జగదీష్ రెడ్డి 
  • నడిగూడెం కోటలో దివంగత కొమ్మర్రాజు వెంకట లక్ష్మణ్ రావు శతవర్ధంతి వేడుకలు
  • ముఖ్య అతిధులుగా హాజరైన మంత్రులు జగదీష్ రెడ్డి,నిరంజన్ రెడ్డిలు
  • పాల్గొన్న యం ఎల్ సి గోరటి వెంకన్న,యం ఎల్ ఏ బొల్లం మల్లయ్య యాదవ్,రాష్ట్ర డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సోమా భరత్ కుమార్, జస్టిస్ రామలింగేశ్వర రావు,మాజీ మంత్రి మండలి బుద్ధ ప్రసాద్,ఐ ఏ ఎస్ అధికారి ముక్తేశ్వర్ రావు,తెలుగు భాషా ఉద్యమ సమాఖ్య గౌరవ ఉపాధ్యక్షుడు సామల రమేష్ బాబు,ఆంధ్రపత్రిక సంపాదకులు  శర్మ,తెలుగు భాషోద్యమ సమాఖ్య అధ్యక్షుడు ప్రొఫెసర్ ఉమామహేశ్వరరావు, రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్,చరిత్ర పరిశోధకులు జితేంద్ర బాబు తదితరులు.

ముద్ర ప్రతినిధి, సూర్యాపేట:-మాతృ భాష పరిరక్షణకు పాటు పడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అమ్మ మీద ఉన్నంత ప్రేమ మాతృభాష మీద ఉండాలని ఆయన కోరారు.సృష్టిలో ప్రాణి జీవనానినికి అమ్మ ఎంతటి అవసరమో,అదే ప్రాణి జీవితంలో మనుగడ సాధించడానికి భాష అంతటి అవసరంగా గుర్తించ గలిగిన రోజునే మాతృభాష కాపడబడుతుందని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో భాష దూరభిమానం ఎంతమాత్రం కాకూడదని మంత్రి జగదీష్ రెడ్డి హితవు పలికారు. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గ పరిధిలోని నడిగూడెం ఘడిలో జరిగిన దివంగత కొమ్మర్రాజు వెంకట లక్ష్మణ్ రావు శత వర్థంతి వేడుకలలో ఆయన సహచర మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి లతో కలసి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. కొమ్మర్రాజు సాహితీ సాంస్కృతిక సమాఖ్య నడిగూడెం ఆధ్వర్యంలో చరిత్ర పరిశోధకులు జితేంద్ర బాబు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలోయం ఎల్ సి గోరటి వెంకన్న,యం ఎల్ ఏ బొల్లం మల్లయ్య యాదవ్,రాష్ట్ర డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సోమా భరత్ కుమార్,జస్టిస్ రామలింగేశ్వర రావు,మాజీ మంత్రి మండలి బుద్ధ ప్రసాద్,ఐ ఏ ఎస్ అధికారి ముక్తేశ్వర్ రావు,తెలుగు భాషా ఉద్యమ సమాఖ్య గౌరవ ఉపాధ్యక్షుడుసామల రమేష్ బాబు,ఆంధ్రపత్రిక సంపాదకులు మా శర్మ,తెలుగు భాషోద్యమ సమాఖ్య అధ్యక్షుడు ప్రొఫెసర్ ఉమామహేశ్వరరావు, రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్,చరిత్ర పరిశోధకులు జితేంద్ర బాబు తదితరులు పాల్గొన్నారు.

జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ సంస్కృతికని, సంప్రాదాయన్నీ, విలువలను ప్రతిబింబింబింప చేసేదే మాతృభాష అని ఆయన అభివర్ణించారు. అటువంటి మాతృభాషపై మమ కారం పెంపొందించుకోవడం తో పాటు పట్టు సాధించే దిశగా నిరంతర ప్రయత్నం ఉండాలని ఆయన ఆకాంక్షించారు. అదే సమయంలో మాతృభాష దూరభిమానం కాకూడదని ఆయన చెప్పారు. రోజు రోజుకు పరాయి బాష మీద పెరుగుతున్న మోజును తగ్గించుకోవాల్సిన ఆవశ్యకతను ఆయన సుస్పష్టంగా వెల్లడించారు. అయితే అవసరం కోసం పరాయి భాషను నేర్చుకోవడాన్ని తప్పు పట్టడం లేదన్నారు.భాషకు ఉత్పత్తులకున్న అవినాభావ సంబంధాన్ని మంత్రి జగదీష్ రెడ్డి సోదాహరణంగా వివరించారు.

ఉత్పత్తుల భాషను కేవలం మాతృభాషద్వారా మాత్రమే వ్యక్తికరించ గలుగు తమాన్నారు.ఎటువంటి పరిస్థితులలో ఉత్పతుల భాషను ఇతర భాషల్లోకి తర్జుమా చేయలేమన్న వాస్తవాన్ని గుర్తించ గలిగితే మాతృభాషకు ఉన్న ప్రాముక్యత ఇట్టే తెలిసి పోతుందని ఆయన తెలిపారు. అటువంటి ప్రయత్నం 100 ఏండ్ల కిందటే కొమ్మర్రాజు వెంకట లక్ష్మణ్ రావు లాంటి ఉద్దండులు మొదలు పెట్టారని ఆయన చెప్పారు. అందులో బాగామే గ్రంధాలయాల ఏర్పాటు,ఆంధ్ర సారస్వత పరిషత్ వంటి ఏర్పాట్లు అని ఆయన తెలిపారు. అటువంటి మాతృభాష పటిష్ఠతకు పునాదులు వేసిన దివంగత కొమ్మర్రాజు లక్ష్మణ్ రావు తెలుగు భాషా వైతాళికుడు అని ఆయన కొనియాడారు. బాషా పాండిత్యాన్ని అవపోసన పట్టిన ప్రజ్ఞాశాలి లక్ష్మణ్ రావు అని అటువంటి మహనీయుడి శత వర్థంతి సభను ఏర్పాటు చేసుకుని స్మరించుకోవడం అంటేనే మాతృభాషపై మమకారాన్ని చాటుకున్నట్లవుతుందని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.