నిర్మాణ పనులు ముమ్మరం చేయాలి -మంత్రి జగదీశ్​రెడ్డి

 నిర్మాణ పనులు ముమ్మరం చేయాలి -మంత్రి జగదీశ్​రెడ్డి

ముద్ర ప్రతినిధి, సూర్యాపేట: సూర్యాపేట పట్టణానికి మరో  మణిహారం గా నిర్మితమవుతున్న  జిల్లా పోలీస్ కార్యాలయ భవన నిర్మాణం తుది దశకు చేరుకుంది. ప్రారంభానికి సిద్ధమై  తుదిమెరుగులు దిద్దుకుంటున్న సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయ భవనాన్ని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి  జగదీశ్​ రెడ్డి పరిశీలించారు.20 ఎకరాల విస్తీర్ణంలో లో  8 కోట్ల 50 లక్షల వ్యయం తో  సరికొత్త హంగులతో నిర్మాణం జరుపుకుంటున్న విషయం తెలిసిందే. జిల్లా ఎస్పీ , తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ అధికారుల తో కలిసి నూతన కార్యాలయ ప్రాంగణంలో కలియ తిరిగిన మంత్రి అక్కడే సమీక్ష సమావేశం నిర్వహించారు. వర్షాకాలం ముంచుకొస్తున్న తరుణంలో  పరేడ్ గ్రౌండ్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. భవన సముదాయంలో ల్యాండ్స్ స్కేప్ నిర్మాణం తో పచ్చదనం ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. భవనం లోపల మిగిలి ఉన్న చివరి దశ పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు మంత్రి వెంట  రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అబ్దుల్ కుతుస్ హుసేని, డి .ఈ సుందర్, ఏఈ బాలరాజ్, డీఎస్పీలు నాగభూషణం వెంకటేశ్వర రెడ్డి, రవి, ఎస్బి సి .ఐ తుల శ్రీనివాస్, టౌన్ సిఐ రాజశేఖర్, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.