‘రా’ చీఫ్​గా రవి సిన్హా

‘రా’ చీఫ్​గా రవి సిన్హా

న్యూఢిల్లీ: ‘రా’ (రీసెర్చ్​ అండ్​ అనాలసిస్​ వింగ్) చీఫ్​గా 1988 బ్యాచ్​కు చెందిన ఐపీఎస్​ అధికారి రవి సిన్హాను నియమిస్తూ సోమవారం కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సిన్హా ఇదివరలో మంత్రిమండలికి భద్రత కల్పించే సీనియర్​ అధికారిగా పనిచేశారు. రా చీఫ్​గా రవి సిన్హా రెండేళ్ళు పనిచేసేందుకు మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. రవి సిన్హా సమంత్​ గోయల్​ స్థానాన్ని భర్తీ చేయనున్నారు. గోయల్​కార్యకాలం జూన్​ 30వరకు ఉంది. గోయల్​ పంజాబ్​ కేడర్​ ఐపీఎస్​. సమంత్​ గోయల్​ ఆధ్వర్యంలోనే పాక్​లోని బాలాకోట్​లో ఎయిర్​స్ర్టైక్స్​ జరిగాయని కూడా పలువురు చెప్పుకుంటారు. 370 ఆర్టికల్​ రద్దు కూడా సమంత్​ గోయల్​ ఆలోచనే అనే వాదనలున్నాయి. కాగా "రా" చీఫ్​గా నియమితులైన రవి సిన్హా బిహార్​లోని భోజ్​పూర్​ జిల్లాకు చెందినవారు. ఢిల్లీలోని సెయింట్​ స్టీఫెన్స్​ కాలేజీలో విద్యనభ్యసించారు. 1988లో యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. రవి సిన్హాకు ప్రభుత్వం మధ్యప్రదేశ్​కేడర్​ బాధ్యతలను అప్పజెప్పింది. అటల్​బిహారీ వాజ్​పేయి కాలంలో ఛత్తీస్​ఘడ్​లో తీసుకున్న పలు నిర్ణయాలలో రవి సిన్హా కూడా కీలక పాత్ర వహించినట్లు చెప్పుకుంటారు.ఈయన ప్రస్తుతం కేబినెట్​లో పీఎస్​వో పదవిలో ఉన్నారు. రాచీఫ్​ పదవీ బాధ్యతలను రవి సిన్హా జూన్​ 30న చేపట్టనున్నారు.