Budget 2023-24: కేంద్ర బడ్జెట్... ఆదాయ పన్ను పరిమితి పెంపు

Budget 2023-24: కేంద్ర బడ్జెట్... ఆదాయ పన్ను పరిమితి పెంపు
Budget 2023-24: Union Budget... Increase in Income Tax Limit

కేంద్రం ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2023-24 బడ్జెట్ లో వేతన జీవులపై కరుణ చూపించారు. అన్ని మినహాయింపులతో కూడుకుని రూ.7 లక్షల లోపు వార్షికాదాయం ఉన్నవారికి ఊరట కలిగిస్తూ, ఇన్ కమ్ టాక్స్ రిబేటును విస్తరిస్తున్నట్టు తెలిపారు. తద్వారా ఆదాయ పన్ను పరిమితిని రూ.7 లక్షలకు పెంచుతున్నట్టు తెలిపారు. అయితే ఇది నూతన ఆదాయ పన్ను విధానాన్ని ఎంచుకున్న వారికి మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు. 

ఇక వ్యక్తిగత ఆదాయ పన్ను రేట్ల గురించి వివరించారు. స్టాండర్డ్ డిడక్షన్ రూ.2.50 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచారు. రూ.3 లక్షల ఆదాయం వరకు ఎలాంటి పన్ను లేదని తెలిపారు. రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు 5 శాతం పన్ను ఉంటుందని... రూ.6 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు 10 శాతం పన్ను ఉంటుందని వివరించారు. 
రూ.9 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు 15 శాతం పన్ను.... రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు 20 శాతం పన్ను... రూ.15 లక్షలు దాటితే 30 శాతం పన్ను ఉంటుందని తెలిపారు.