ముగిసిన సీఎం జగన్‌ దిల్లీ పర్యటన

ముగిసిన సీఎం జగన్‌ దిల్లీ పర్యటన

ఏపీ సీఎం జగన్‌ దిల్లీ పర్యటన ముగిసింది. రెండు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం కేంద్రహోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయిన సీఎం.. నేడు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమయ్యారు. ఆర్థిక మంత్రితో సీఎం భేటీ సుమారు అరగంటపాటు కొనసాగింది. పర్యటన అనంతరం సీఎం విజయవాడ బయల్దేరారు.  జగన్‌ దిల్లీ పర్యటనపై సీఎంవో ప్రకటన విడుదల చేసింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.10వేల కోట్లు, డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మాణానికి రూ.2,020కోట్లు ఇవ్వాలని అమిత్‌షాను సీఎం కోరినట్లు తెలిపింది.