కేసీఆర్ పాలన లో కలారంగానికి పెద్ద పీట

కేసీఆర్ పాలన లో కలారంగానికి పెద్ద పీట
  • నేటి సాహిత్యమే రేపటి చరిత్ర
  • రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సంస్కృతి కి పునర్జీవం
  • ముఖ్యమంత్రి కేసీఆర్  పాలన లో కవులుకళాకారులకు సముచిత స్థానం 
  • సమాజ హితమే సాహిత్య లక్ష్యం
  • సాహిత్యం అనేది చారిత్రక అవసరం 
  • సమాజంలో జరిగిన ప్రతీ ఉద్యమంలో సాహిత్యానిదే కీలక పాత్ర
  • దశాబ్దిలోనే శతాబ్దిని సృష్టించింది  తెలంగాణ
  • మంటల్ని కురిపించిన సాహిత్య మే  తెలంగాణ రాష్టాన్ని సాధించి పెట్టింది 
  • సంప్రదాయ  పంచ కట్టులో హాజరైన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే కిషోర్ కుమార్, సూర్యాపేట జిల్లా అధికార యంత్రాంగం 

ముద్ర ప్రతినిధి, సూర్యాపేట : సమాజ హితమే సాహిత్య లక్ష్యం అనీ,సాహిత్యం అనేది చారిత్రక అవసరం  అన్నారు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి .తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి సూర్యాపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ సాహిత్య దినోత్సవం అట్టహాసంగా నిర్వహించారు. కవులు, కవయిత్రులు, సాహితీ వేత్తలు ఉత్సాహంగా తరలివచ్చి తమ పద్య, వచన కవిత్వాలతో తెలంగాణ ఔన్నత్యాన్ని, నాడు ఉద్యమ తెలంగాణ, నేడు ఉజ్వల తెలంగాణ అంటూ ఆవిష్కరింపజేశారు. జిల్లా కేంద్రంలోని పాత మార్కెట్ యార్డ్ ఆవరణం సాహిత్య సౌరభాల గుభాళింపులకు వేదికైంది.సంప్రదాయ  పంచె కట్టు లో  వచ్చి జ్యోతి ప్రజ్వలనతో కవి సమ్మేళనం కార్యక్రమాన్ని తుంగతుర్తి శాసన సభ్యులు గాదరి కిషోర్ కుమార్ తో కలిసి మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు. తెలంగాణ  కవి సమ్మేళనంలో పాల్గొన్న కవులందరిని  మంత్రి సన్మానించి, ప్రశంసా పత్రం, నగదు బహుమతి, కొత్త బట్టలు పెట్టి జ్ఞాపిక లతో  సత్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ   కలారంగానికి పెద్ద పీట  వేసిన ఘనత ముఖ్యమంత్రి కేసిఆర్ దే అన్నారు.నేటి సాహిత్యమే.. రేపటి చరిత్ర అన్న మంత్రి,రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సంస్కృతి కి పునర్జీవం లభించిందని అన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్  పాలన లో కవులుకళాకారులకు సముచిత స్థానం  దక్కిందని అన్నారు.సమాజంలో జరిగిన ప్రతీ ఉద్యమంలో సాహిత్యానిదే కీలక పాత్ర అని పేర్కొన్నారు.

మంటల్ని కురిపించిన సాహిత్య మే  తెలంగాణ రాష్టాన్ని సాధించి పెట్టిందన్న మంత్రి,దశాబ్దిలోనే శతాబ్దిని సృష్టించింది  తెలంగాణ రాష్ట్రం అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని పరిస్థితిలో 2014 ముందు ప్రస్తుతం ఉన్న అభివృద్ధిని బేరీజు వేసుకుని నిజా నిజాలను ప్రజలకు తెలియ జేయవలసిన బాధ్యత కవుల దే అని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. తుంగతుర్తి శాసన సభ్యులు డాక్టర్ కిషోర్ కుమార్ మాట్లాడుతూ,తెలంగాణ సాహిత్య పూర్వ వైభవానికి  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే కారణం అన్నారు. కెసిఆర్ పాలనలో తెలంగాణ సాహిత్యానికి పూర్వ వైభవం వచ్చిందన్నారు. స్వతహాగా సాహితీ సాహిత్య ప్రియుడైన ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు వేల పద్యాలు చెప్పగల మహా కవి అని కొనియాడారు.  మాట, యాస , బాషా తోనే రాష్ట్రాన్ని సాధించిన ఘనత కేసీఆర్ ది అన్నారు. సాంప్రదాయ దుస్తుల తొ సాహిత్య దినోత్సవ వేడుకలు జరుపుకోవడం అభినందనీయం అన్నారు.

కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ వెంకట్రావు అడిషనల్ కలెక్టర్ హేమంత్ కేశవ్, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకట్ నారాయణ గౌడ్, గ్రంధాలయ చైర్మెన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ ఛైర్మన్ పెరుమాల అన్నపూర్ణ, పెద్ది రెడ్డి గణేష్, కమీషనర్ రామానుజం రెడ్డి, డిఎస్పీ నాగభూషణం సమాచార శాఖ ఏడి రమేష్ డిపిఆర్ఓ హబీబ్ తదితరులు పాల్గొన్నారు.