మెదక్ లో 2కే రన్ జెండా ఊపి పాల్గొన్న ఎమ్మెల్యే పద్మ, కలెక్టర్ షా

మెదక్ లో 2కే రన్ జెండా ఊపి పాల్గొన్న ఎమ్మెల్యే పద్మ, కలెక్టర్ షా

ముద్ర ప్రతినిధి, మెదక్: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రం మెదక్ పట్టణలో సోమవారం ఉదయం 2కె రన్ నిర్వహించారు. ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజర్షి షా జెండా ఊపి ప్రారంభించి పరుగులో పాల్గొన్నారు. పట్టణంలోని రాందాస్ చౌరస్తా నుండి స్టేడియం వరకు ఈ రన్ నిర్వహించారు. ఈ రన్ లో ప్రతి ఒక్కరూ దశాబ్ది ఉత్సవాల టీషర్ట్లు, క్యాపులు ధరించి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయన్నారు. 14 సంవత్సరాల ఉద్యమ ప్రస్థానంతో పాటు గడచిన తొమ్మిది సంవత్సరాలుగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు తెలియజేయాలన్నదే దశాబ్ది ఉత్సవాల ఉద్దేశమన్నారు. అన్ని రంగాలలో అభివృద్ధి పరుస్తూ ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దేనన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆరెళ్ల మల్లికార్జున గౌడ్, ఆర్డీవో సాయిరాం, డిఎస్పి సైదులు, జిల్లా క్రీడల, యువజన అధికారి నాగరాజు,  జిల్లా అధికారులు,  కౌన్సిలర్లు మామిళ్ళ ఆంజనేయులు, సమీ, నాయకులు  శివరామకృష్ణ,  జుబేర్, కొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

పోలీసుల ఆధ్వర్యంలో 2కే రన్ తూప్రాన్ లో...

తూప్రాన్, ముద్ర: తూప్రాన్ లో పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన 2కే రన్ ను గడా ప్రత్యేక అధికారి ముత్యంరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. తూప్రాన్ పోతరాజ్ పల్లి కమాన్ నుండి బస్టాండ్ వరకు సాగిన రన్ లోఆర్డీఓ శ్యామ్ ప్రకాష్,డిఎస్పి యాదగిరి రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రవీందర్ గౌడ్, సీఐ శ్రీధర్, ఆయా పోలీస్ స్టేషన్ ల ఎస్ఐలు, సిబ్బంది, యువత, విద్యార్థులతో కలిసి పాల్గొని విజయవంతం చేశారు.

నర్సాపూర్ లో జెండా ఊపిన ఎమ్మెల్యే మదన్ రెడ్డి నర్సాపూర్ పట్టణంలో నిర్వహించిన 2కె రన్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ఉదయం నడక ఎంతో మంచిదన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రతిమసింగ్, నర్సాపూర్ డివిజన్ అధికారులు, పోలీసులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.