నర్సాపూర్ బిజెపి అభ్యర్థిగా మురళి యాదవ్

నర్సాపూర్ బిజెపి అభ్యర్థిగా మురళి యాదవ్
  • ఆర్టీసీ కండక్టర్ నుండి అసెంబ్లీ పోటీ దాకా ప్రస్థానం

ముద్ర ప్రతినిధి, మెదక్:మెదక్ జిల్లా నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ బిజెపి అభ్యర్థిగా సిట్టింగ్ మున్సిపల్ చైర్పర్సన్ ఎర్రగొల్ల మురళీ యాదవ్ పేరును అధిష్టానం ప్రకటించింది. మురళి యాదవ్ నర్సాపూర్ పట్టణంలో రామయ్య లక్ష్మమ్మలకు జన్మించాడు. 1985 నుండి 1995 వరకు మెదక్ ఆర్టీసీ కండక్టర్గా పని చేశాడు. సిపిఐ నాయకుడు చిలుముల విఠల్ రెడ్డి శిష్యుడిగా పేరుందిన మురళీ యాదవ్ 1995 నుండి 2012 వరకు నర్సాపూర్ సర్పంచిగా మూడు పర్యాయాలు పని చేశాడు. 2008లో తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా ఎంపికయ్యారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. 2014 నుండి 2019 వరకు మురళి యాదవ్ సతీమణి రాజమణి ఉమ్మడి మెదక్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా పని చేశారు. అలాగే మురళీ యాదవ్ 2014 నుండి 19 వరకు టిఆర్ఎస్ అధ్యక్షులుగా పనిచేయడం జరిగింది. 2020లో నర్సాపూర్ పురపాలక సంఘం ఏర్పాటు కాగా మొదటి మున్సిపల్ చైర్మన్ గా టిఆర్ఎస్ తరపున ఎన్నికయ్యారు. 2022 ఆగస్టులో టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి అక్టోబర్ 9న బీజేపీలో చేరారు. తర్వాత రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియమించారు. నర్సాపూర్ ఎమ్మెల్యేగా గెలుపొందడమే ధ్యేయంగా పార్టీని బలోపేతం చేస్తు ముందుకు సాగుతున్నాడు.

కండక్టర్ నుండి...

మురళీ యాదవ్ మెదక్ డిపోలో ఆర్టీసీ కండక్టర్ గా పనిచేశారు. సిపిఐ పార్టీలో చేరి   న అనంతరం నర్సాపూర్ సర్పంచ్ గా మూడు పర్యాయాలు, ప్రస్తుతం నర్సాపూర్ మున్సిపల్ కమిషనర్ గా పనిచేస్తున్నారు. ఒక ఆర్టీసీ కండక్టర్ అంచెలంచెలుగా ఎదిగి ఎమ్మెల్యే పదవికి పోటీకి సిద్ధమయ్యాడు.