కెసిఆర్ తోనే అభివృద్ధి

కెసిఆర్ తోనే అభివృద్ధి
  • రామాయంపేట ప్రచారంలో బిఆర్ఎస్ అభ్యర్థి పద్మ

ముద్ర ప్రతినిధి, మెదక్:మెదక్ నియోజకవర్గం  అభివృద్ధి చెందాలంటే కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ఎమ్మెల్యే, బిఆర్ఎస్ అభ్యర్థి ఎం.పద్మా దేవేందర్ రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.రామయంపేట మున్సిపాలిటీలో కేసీఆర్ నగర్ కాలనీలో ప్రారంభించి  వార్డులలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమెకు మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్ ఆధ్వర్యంలో బిఅర్ఎస్ శ్రేణులు డప్పు చప్పుళ్లు, మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...

ముచ్చటగా మూడోసారి కెసిఆర్ ముఖ్యమంత్రి అవుతున్నారని పద్మ దేవేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మైనంపల్లి హనుమంతరావు మెదక్ నియోజకవర్గాకి చేసింది ఏం లేదన్నారు. ఎమ్మెల్యే అంటే ప్రజలకు మౌలిక వసతులు కల్పించడం, సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టడమన్నారు. కానీ సేవా కార్యక్రమాలు చేస్తూ ప్లేట్లు, గ్లాసులు  పంచడం కాదన్నారు. గ్రామీణ వాతావరణ పరిస్థితులు, వారి మనస్తత్వం తెలియనటువంటి వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది, మాయమాటలను నమ్మొద్దన్నారు.

తెలంగాణ ఉద్యమంలో నేను జై తెలంగాణ అంటే మైనంపల్లి హనుమంతరావు నై తెలంగాణ అన్నాడన్నారు.14 సంవత్సరాలు పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణలో అనేక సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టడం జరిగిందన్నారు.అన్నం పెట్టే రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది.24 గంటల కరెంటుతో రైతులు బాగుపడ్డారన్నారు.గత ప్రభుత్వాల హయాంలో రైతులు నానా అవస్థలు పడ్డారని,  ఎరువుల బస్తాల కోసం పోలీస్ స్టేషన్ లో లైన్లు కట్టారన్నారు.  పెట్టుబడి సాయం అందజేయడం జరుగుతుందన్నారు. ప్రచారంలోచైర్మన్ జితేందర్ గౌడ్, పుట్టి విజయ లక్ష్మి, పట్టణ అధ్యక్షులు నాగరాజు, అహ్మద్, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.