నాడు రాజీనామా చేయని కిషన్ రెడ్డి నేడు ఉత్సవాలు చేస్తాడా

నాడు రాజీనామా చేయని కిషన్ రెడ్డి నేడు ఉత్సవాలు చేస్తాడా
  • విభజన హామీలు నెరవేర్చినందుకు ఉత్సవాల
  • కాంగ్రెస్, బిజెపిలకు మింగుడుపడడం లేదు
  • మంత్రి హరీష్ రావు ఫైర్
  • పార్లమెంటుకు అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్
  • దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తాం

ముద్ర ప్రతినిధి, మెదక్: నాడు తెలంగాణ ఉద్యమంలో రాజీనామాకు ఆయన భయపడిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేకంగా ఉత్సవాలు చేస్తామనడంపై రాష్ట్ర అర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి. హరీష్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్, బిజెపిలకు ఉత్సవాలు జరపడం మింగుడుపడటం లేదన్నారు. ఆదివారం సాయంత్రం మెదక్ కలెక్టరేట్లో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ...
ఉద్యమంలో నాడు రెండు పార్టీలు కలిసి రాలేదు..  నేడు ఉత్సవాలకు రావడం లేదన్నారు. అమరుల త్యాగాలను కాంగ్రెస్ తక్కువ చేస్తోందని ద్వాజమెత్తారు. 
తెలంగాణకు కేంద్రం ఏం చేయలేదని ఉత్సవాలు చేస్తారా..? ఉత్సవాలు జరిపే నైతికత బిజెపికి ఉందా అని ప్రశ్నించారు. ఏడు మండలాలు, రైల్వే కోచ్, బయ్యారం బుక్కు, గిరిజన యూనివర్సిటీ, 4 మెగావాట్ల పవర్ ప్రాజెక్ట్ ఇవ్వనందుకు ఉత్సవాలు చేస్తారా అన్నారు. 

 ప్లానింగ్ కమిషన్, నీతి ఆయోగ్ లు సిఫారసులు చేసినా కేంద్రం ఏనాడు పట్టించుకోలేదన్నారు. విభజన సమస్యల పరిష్కారంలో కేంద్రం విఫలమైందని పేర్కొన్నారు. కృష్ణా జలాల వాటా తేల్చరు... స్వయంగా సీఎం కేసీఆర్ లేఖలు రాసినా స్పందన లేదన్నారు. రాష్ట్రానికి రావాల్సిన 1350 కోట్ల బకాయిలు ఇవ్వడం లేదన్నారు. కేంద్రానికి నచ్చిన రాష్ట్రాలకు మాత్రం ప్రత్యేక ఫ్యాకేజీలు ఇస్తున్నారు.. కానీ ప్రశ్నించిన రాష్ట్రాలకు మాత్రం ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. నీతీ ఆయోగ్ కు ఇజ్జత్ ఉందా... కేంద్రం ఏనాడైన విలువ ఇచ్చారా..

మోదిలో ఫెడరల్ స్ఫూర్తి దెబ్బతిందన్నారు. నితీ ఆయోగ్ మిషన్ భగీరథ కు 20 వేల కోట్లు ఇవ్వాలని చెబితే కనీసం 20 పైసలు ఇవ్వలేదన్నారు. 
నీతి ఆయోగ్ సమావేశాలకు గతంలో ఎన్నో సార్లు కెసిఆర్ హాజరయ్యారని తెలిపారు. 
రాష్ట్ర అప్పుల గురించి కాదు... కేంద్రం చేసిన అప్పుల సంగతి ముందు చెప్పండని హరీష్ రావు ప్రశ్నించారు. రాష్ట్రం పరిమితికి లోబడి అప్పులు  చేస్తుందని, .కేంద్రం ఎప్పుడో పరిమితి దాటిందన్నారు. 
పార్లమెంట్ కు అంబేద్కర్ పెరు పెట్టుమంటే ఎందుకు ముఖం చాటేస్తున్నారని ప్రశ్నించారు. 
రాష్ట్రపతి, గవర్నర్ వ్యవస్థ లకు తేడా తెలియకుండా కొందరు మాట్లాడుతున్నారని విమర్షించారు. ఇప్పటికైనా పార్లమెంట్ కు అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. మోదీ చెప్పేవన్నీ టీమ్ ఇండియా... చేసేవి మాత్రం తొడో ఇండియా లా ఉందన్నారు. రాష్ట్ర అవతరణను వ్యతిరేకించడం అంటే అమరులను అవమానించడమేనన్నారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. 
21 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతాయన్నారు. 
అమరుల త్యాగాలను, 9 ఏళ్లలో జరిగిన అభివృద్ధి స్మరించుపోవాల్సిన అవసరం ఉందన్నారు. జూన్ 2 మనకు స్వాతంత్య్ర దినం లాంటిందని, 
సమైక్య రాష్ట్రంలో 10 జిల్లాల్లో 9 జిల్లాలు వెనుకబడి ఉన్నాయని, నేడు తెలంగాణ అభివృద్ధి దేశానికి ఆదర్శమన్నారు. తెలంగాణ ఆచరిస్తున్నది... దేశం అనుసరిస్తుందన్నారు. 
అన్ని వర్గాలు ప్రగతి పథంలో ఉన్నాయని హరీష్ రావు వివరించారు. ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, మదన్ రెడ్డి, క్రాంతి కిరణ్, భూపాల్ రెడ్డి, మాణిక్ రావు, సతీష్, వివిధ సంస్థల చైర్మన్ లు చింత ప్రభాకర్, ఎర్రోళ్ల శ్రీనివాస్, ప్రతాపరెడ్డి, డిసీసీబి చైర్మన్ దేవేందర్ రెడ్డి, డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్ర గౌడ్ తదితరులు ఉన్నారు.