ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగం పెంచాలి కలెక్టర్ రాజర్షి షా

ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగం పెంచాలి కలెక్టర్ రాజర్షి షా

ముద్ర ప్రతినిధి, మెదక్:ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. మంగళవారం నర్సాపూర్ మండలం పెద్ద చింతకుంటలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇప్పటికే రైతులు అకాల వర్షాలతో తల్లడిల్లుతున్నారని, ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు కలిగించవద్దని, తేమ శాతం కాస్త అటు ఇటు ఉన్న తూకం వేయాలని సూచించారు. రైతులు ప్యాడి క్లినర్ ల ధాన్యం తూర్పారబట్టి తాలు లేకుండా నాణ్యమైన ధాన్యం కేంద్రాలకు తెచ్చిప్రభుత్వం  ఇచ్చే మద్దతు ధర పొందాలని సూచించారు.
ప్రతిష్టాత్మకంగా సిఎం కప్-2023 క్రీడా పోటీలు
ప్రభుత్వం  ప్రతిష్టాత్మకంగా  నిర్వహించనున్న సిఎం కప్-2023 క్రీడా పోటీలకు  మండల, జిల్లా స్థాయిలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులకు సూచించారు. ఎస్పీ రోహిణి ప్రియదర్శినితో కలిసి క్రీడా పోటీల నిర్వహణ, ఏర్పాట్లపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు.  మండల స్థాయిలో కోకో, కబడ్డీ, వాలీబాల్, ఫుట్ బాల్, అథ్లెటిక్స్ పోటీలను ఈ నెల 15 నుండి 17 వరకు నిర్వహించనున్నామన్నారు.ఆరోగ్య మహిళా కేంద్రాలకు చక్కటి స్పందన జిల్లాలో నిర్వహిస్తున్న ఆరోగ్య మహిళా కేంద్రాలను మహిళలు చక్కగా వినియోగించుకుంటున్నారని, స్పందన బాగున్నదని జిల్లా కలెక్ట రాజర్షి షా అన్నారు. శివ్వంపేటలోని ఆరోగ్య మహిళా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి మహిళలకు చేస్తున్న  వివిధ రకాల వైద్య  పరీక్షల  వివరాలను డాక్టర్ సాయి సౌమ్యను అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించారు. వెంట  తహశీల్ధార్  శ్రీనివాస చారి   తదితరులున్నారు.

శిక్షణ పొందుతూనే  ఉపాధిఅవకాశాలు
 టెక్ బీ - హెచ్ సిఎల్ ఎర్లీ కెరీర్ ప్రోగ్రాంలో చేరి, శిక్షణ పొందుతూనే  ఉపాధి అవకాశం  పొందవచ్చని  జిల్లా కలెక్టర్ రాజర్షి షా  తెలిపారు.  ఇంటర్మీడియట్ పూర్తి చేసి టెక్నాలజీని కెరీర్ గా ఎంచుకుని, ఉపాధి కోరుకునే వారికి ఇదొక  సువర్ణావకాశమన్నారు