సీనియర్ సిటిజన్స్, ఇతర ఓటర్ నమోదుకు ప్రాధాన్యత

సీనియర్ సిటిజన్స్, ఇతర ఓటర్ నమోదుకు ప్రాధాన్యత
  • కలెక్టర్ రాజర్షి షా

ముద్ర ప్రతినిధి, మెదక్:ఓటరు జాబితా సవరణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. ఆదివారం జిల్లాలోని మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులతో  టెలికన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడారు... స్పెషల్ డ్రైవ్ లో భాగంగా స్వీకరించిన ఫారం-6 దరఖాస్తులను బిఎల్వోలు వెంటనే ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. ఫారం 7 ,8 దరఖాస్తులను బిఎల్వోలు, సూపర్వైజర్లు  ఇంటింటికి వెళ్లి పరిశీలించి ఓటరు జాబితాలో నమోదు చేయాలన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలోని ప్రతి ఓటర్ తమ ఓటును   యాప్ ద్వారా పరిశీలించుకునేలా బిఎల్ఓ,  సుపర్వైజర్లు చైతన్యం చేయాలన్నారు.

ఓటరు జాబితాలో తమ పేరు, ఇతర వివరాలు సరిచూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఓటరు జాబితాలో వృద్ధులు, వికలాంగులు, ట్రాన్స్ జెండర్ లు, ఎస్సీ ఎస్టీ తదితర వివరాలు నమోదు చేయాలన్నారు.  మున్సిపల్ పరిధిలో పన్నులు కట్టిన వారు ఆయా పోలింగ్ స్టేషన్లలో అయ్యారా లేదా అన్న వివరాలు సరిచూడాలన్నారు. నమోదు కాకుంటే నమోదయ్యేలా చూడాలని బిఎల్ఓలకు సహాయ ఎన్నికల అధికారులకు సూచించారు. రిటర్నింగ్ అధికారులు డీఎస్పీలతో సమావేశమై ఎన్నికల వ్యయంపై సమీక్ష జర పాలి.  ఆయా నియోజకవర్గాల పరిధిలో గత ఆరు నెలలుగా జరిగిన పెద్ద మొత్తం నగదు లావాదేవీలు వివరాలు సేకరించాలన్నారు, నియోజకవర్గంలో పరిధిలోని క్రిటికల్ పోలింగ్ స్టేషన్ల వివరాలు రూట్ మ్యాప్ లు సిద్ధం చేయాలని ఆదేశించారు.

 ఈఎల్సికి సంబంధించి తొమ్మిది, పది తరగతుల విద్యార్థులు, జూనియర్ కళాశాల విద్యార్థులకు ప్రతిరోజు ఒక కార్యక్రమం నిర్వహించి అవగాహన కల్పించాలన్నారు. ఓటరు జాబితా నుండి తప్పుగా తొలగించిన ఓటర్ల వివరాలు క్షేత్రస్థాయిలో పరిశీలించి తిరిగి నమోదు చేయాలన్నారు. ఓటరుకు సంబంధించిన ఫోటోలను క్లస్టర్ వారిగా వెంట వెంటనే అప్లోడ్ చేయాలని, పేరు ఉన్న వ్యక్తుల వివరాలు క్షుణ్ణంగా పరిశీలించి నమోదు చేయాలని, బిఎల్ఓల వద్ద సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు రెండు నియోజకవర్గాలలో చాలా పెండింగ్ ఉన్నాయి. వాటిని వెంటనే ఆన్లైన్ లో నమోదు చేసి దరఖాస్తు ఫారాలు రిటర్నింగ్ అధికారులకు సమర్పించాలని సూచించారు.
ఈ టెలికాన్ఫరెన్స్ లో  అధికారులు శ్రీనివాస్,  బ్రహ్మజీ, మెదక్, నర్సాపూర్  తదితరులు పాల్గొన్నారు