కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కరెంట్ కష్టాలు బిఆర్ఎస్ అభ్యర్థి పద్మ దేవేందర్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కరెంట్ కష్టాలు బిఆర్ఎస్ అభ్యర్థి పద్మ దేవేందర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, మెదక్: కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కరెంట్ కష్టాలు తప్పవని మెదక్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు. బిజెపి పార్టీకి ఓటు వేస్తే రైతుల మోటార్లకు మీటర్లు పెట్టే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. శుక్రవారం చిన్న శంకరంపేట్ మండలంలోని ధరిపల్లి, అగ్రహారం, గవ్వలపల్లితో పాటు పలు గ్రామాలలో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..11 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ వల్ల పాలకులు అభివృద్ధి చెందారే తప్ప, పల్లెలు అభివృద్ధి చెందలేవన్నారు. దేశంలో ఎక్కడా అమలుకానీ సంక్షేమ అభివృద్ధి పథకాలు కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే అమలవుతున్నాయన్నారు. ప్రపంచ దేశాలు సైతం తెలంగాణ వైపు చూస్తున్నాయంటే దానికి కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

ముచ్చటగా మూడోసారి కారు గుర్తుకు ఓటు వేసి, కెసిఆర్ ను గెలిపించుకొని కాంగ్రెస్, బిజెపి పార్టీలకు తెలంగాణ సత్తా చూపించాలన్నారు. కార్యక్రమంలో జడ్పిటిసి పట్లోరి మాధవి రాజు, పార్టీ మండల అధ్యక్షుడు పట్లోరి రాజు, నాయకులు ఏకే గంగాధర్ రావు, నరసింహారెడ్డి, షేక్ రెడ్డి, యేమ చంద్రం, యేమ వెంకటేశం, దర్జీ శివుడు, యువ నాయకులు నాగరాజు, రాజు, మహేష్, రాజ్ కుమార్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. చిన్న శంకరంపేట మండలంలోని సూరారం గ్రామానికి చెందిన గౌడ సంఘం సభ్యులు బిఆర్ఎస్ లో చేరారు. బాగిర్తిపల్లి గ్రామానికి చెందిన బిజెపి నాయకులు వెంకటేష్, సత్యనారాయణ, మహేష్, బాబు, రాజు, పర్వతాలు సహ గ్రామానికి చెందిన గౌడ సంఘం సభ్యులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.