మంత్రిని కలిసిన మాజీ సర్పంచ్ సత్యనారాయణ

మంత్రిని కలిసిన మాజీ సర్పంచ్ సత్యనారాయణ

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లా సరిహద్దు గ్రామం పోచమరాల్ వద్ద ఆగిన మంత్రి తన్నీరు హరీష్ రావుకు హవేలి ఘనపూర్ మండలం జక్కన్నపేట మాజీ సర్పంచ్ చామంతుల సత్యనారాయణ ఆధ్వర్యంలో గ్రామస్తులు కలిసి పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం జక్కన్నపేట, పోచమరాలు, సర్ధన గ్రామాలకు సంబందించి సమస్యలతో కూడిన వినతిపత్రం ఇచ్చారు. సర్ధన రోడ్డు, గ్రామాల్లో సీసీ రోడ్లు మంజూరు చేయాలని కోరారు. నాయకులు పర్వయ్య తదితరులున్నారు.