కాపర్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం

కాపర్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం

తుప్రాన్, ముద్ర: మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని ముప్పిరెడ్డిపల్లి పారిశ్రామిక వాడలోని కిసాన్ కాపర్ పరిశ్రమలో శుక్రవారం ఉదయం అగ్ని ప్రమాదం సంబవించింది. దట్టమైన పొగ కమ్ముకుంది. అప్రమత్తమయిన సిబ్బంది బయటకు పరుగులు తీశారు. వెంటనే నర్సాపూర్ అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించగా ఫైర్ ఇంజన్ తో మంటలను అర్పుతున్నారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.  భారీగానే ఆస్తి నష్టం జరగవచ్చని తెలుస్తుంది